iDreamPost
android-app
ios-app

Geaser: గీజర్ వాడుతున్నారా? జాగ్రత్త.. ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్!

  • Published Dec 02, 2024 | 3:48 PM Updated Updated Dec 02, 2024 | 3:48 PM

Geaser: చాలా మంది కూడా గీజర్ వాడుతూ ఉంటారు. అయితే సరిగ్గా వాడకుంటే ప్రాణాలకే ప్రమాదం.

Geaser: చాలా మంది కూడా గీజర్ వాడుతూ ఉంటారు. అయితే సరిగ్గా వాడకుంటే ప్రాణాలకే ప్రమాదం.

Geaser: గీజర్ వాడుతున్నారా? జాగ్రత్త.. ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్!

ప్రస్తుతం చలికాలం కావడంతో చాలా మంది కూడా గీజర్ వాడుతూ ఉంటారు. కానీ దాన్ని ఎలా వాడాలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రాణాలు పోవడం ఖాయం. చాలా సందర్భాలలో అవి పేలుపోతూ ఉంటాయి. గీజర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కేసులు కూడా తక్కువేం కాదు. రీసెంట్ గా ఒక కొత్త పెళ్లి కూతురు కూడా గీజర్ కారణంగా మృతి చెందింది. కాబట్టి గీజర్ ని కచ్చితంగా చాలా జాగ్రత్తగా వాడాలి. లేకుంటే ప్రాణాపాయం కచ్చితంగా ఉంది. ఇక గీజర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా గీజర్‌ని వాడుతున్నప్పుడు చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. గీజర్‌ను రోజంతా రన్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఇది చాలా పెద్ద తప్పు. గీజర్ వాడిన తరువాత కచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే గీజర్‌ని ఎక్కువసేపు ఆన్‌లో ఉంచడం వల్ల గీజర్ సరిగ్గా పని చేయదు. చాలా మంది ఎక్కువ టెంపరేచర్ పెట్టుకొని వాడతారు. అలా ఎక్కువ వేడి చేయడం కూడా కచ్చితంగా గీజర్ బ్లాస్ట్‌కు దారి తీస్తుంది. ఎక్కువ సేపు స్విచ్ ఆన్ లో ఉన్నా కూడా గీజర్ పేలిపోయే అవకాశం ఉంది. సాధారణంగా గీజర్ వాడుతున్నప్పుడు ఎలాంటి సౌండ్ రాదు. కానీ వాడేటప్పుడు కనుక ఏదైనా సౌండ్ వస్తే.. గీజర్‌ రిపైర్ లో ఉన్నట్టు సంకేతం. అయినా కూడా మీరు గీజర్ వాడుతుంటే అది కచ్చితంగా పేలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కచ్చితంగా ఎలక్ట్రీషియన్ కి కాల్ చేయండి. రిపైర్ చేయించుకోండి.

చాలా మంది కూడా గీజర్ ను క్లీన్ చేయకుండా 10 ఏళ్లు, 15 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా వాడుతూ ఉంటారు. ఇలా వాడటం వల్ల గీజర్ లోపల పేరుకుపోయే వ్యర్ధాలను గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే కనీసం రెండేళ్లకు ఒకసారి గీజర్ ని క్లీన్ చేయించడం అత్యవసరం. ఏళ్ల తరబడి క్లీన్ చేయించకుండా వాడటం వలన చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. జుట్టు ఊడిపోవడం, చిన్న పిల్లలకు అలర్జీ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గీజర్ ని క్లీన్ చేయించాలి.బాత్రూంలో గీజర్ ను సరైన స్థలంలో ఉంచాలి. ఒకవేళ ప్రమాదం జరిగినా మీద పడే అవకాశం లేకుండా బాత్రూంలో నీరు చేరని చోట గీజర్ ను ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. జాగ్రత్తగా ఉండండి.