iDreamPost
android-app
ios-app

INSTAGRAMలో ఈ సెట్టింగ్ మార్చకుంటే చాలా డేంజర్!

  • Published Nov 30, 2024 | 12:51 PM Updated Updated Nov 30, 2024 | 12:51 PM

Instagram: చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటారు. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం మర్చిపోతూ ఉంటారు.

Instagram: చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటారు. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం మర్చిపోతూ ఉంటారు.

INSTAGRAMలో ఈ సెట్టింగ్ మార్చకుంటే చాలా డేంజర్!

ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో కానీ ఇన్స్టా లో అకౌంట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇదొక రంగుల ప్రపంచం. టైమ్ పాస్ కి అడ్డా. ప్రపంచం మొత్తాన్ని మన కళ్ల ముందు ఉంచేస్తుంది. అందుకే దీనికి యూత్ లో క్రేజ్ చాలా ఎక్కువ. ఫేస్ బుక్, ఎక్స్ ల కంటే ఇన్స్టాగ్రామ్ కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు యువత. ఇన్స్టా రీల్స్ ఒక రేంజిలో టైమ్ పాస్ చేస్తాయి. ఇలా ప్రతి ఒక్కరికీ కూడా ఇన్స్టా గ్రామ్ బాగా అలవాటు అయిపోయింది. అయితే బాగా టైమ్ పాస్ అవుతుంది? అని ఏది పడితే అది చూసేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా హ్యాకర్స్ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిని కూడా చూస్తూ ఉంటారు. అలా జరగడానికి కారణం ఎవరో కాదు. అది మీరే. మీరే మీరు చేసే ప్రతి పనిని వేరే వాళ్ళు చూసేలా చేసుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పే సెట్టింగ్ ని మార్చడం వల్ల మీరు చాలా సేఫ్ గా ఇన్స్టాగ్రామ్ ని వాడవచ్చు. ఇంతకీ ఆ సెట్టింగ్ ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయండి. అందులో Account Settings ఓపెన్ చేయండి. అందులో Your informations and permissions ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక ఆ ఆప్షన్ పై క్లిక్ చేశాకా.. Your activity off Meta technologies అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేశాకా.. అందులో Recent Activity అనే ఆప్షన్ కనపడుతుంది.. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాకా.. ఇన్స్టా లో మీరేమేమీ చూశారో.. మీరు ఏమేమి వెతికారో లిస్ట్ మొత్తం చూపిస్తుంది.

అయితే ఈ డేటా ఎవరికి తెలీకుండా ఉండాలంటే అక్కడే Clear Previous activity కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ activity లో మీ డేటా డిలీట్ అయిపోతుంది. ఆ ఆప్షన్ కింద Disconnect specific activity కనపడుతుంది. అది ఓపెన్ చేయగానే అక్కడ మీరు చూసిన హిస్టరీ లిస్ట్ కనపడుతుంది. ఆ లిస్ట్ ని సెలెక్ట్ చేసి కింద continue ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీకు కింద confirm, cancel ఆప్షన్స్ కనిపిస్తాయి. confirm పై క్లిక్ చేస్తే.. మీరు తరువాత నుంచి మీరు ఇంస్టాగ్రామ్ లో ఏమేం చేస్తున్నారో స్టోర్ అవ్వదు. దీనివల్ల ఎవరూ కూడా మీ డేటా చూడలేరు.. మీ అకౌంట్ ని హ్యాక్ చేయలేరు. ఇదే ప్రాసెస్ ఫేస్బుక్ లో కూడా ఉంటుంది. కాబట్టి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ మార్చుకోండి. జాగ్రత్తగా ఉండండి.