18 వేల లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కేవలం 13 వేలకే.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!

50 మెగా పిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ వస్తుందంటే ఎవరు మాత్రం ఆగుతారు. యూత్ కి కావాల్సింది ఇదే కదా. పైగా బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువే. 18 వేల ఫోన్ ని ఆఫర్ లో 13 వేలకే వస్తుంది.

50 మెగా పిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ వస్తుందంటే ఎవరు మాత్రం ఆగుతారు. యూత్ కి కావాల్సింది ఇదే కదా. పైగా బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువే. 18 వేల ఫోన్ ని ఆఫర్ లో 13 వేలకే వస్తుంది.

ఇంకొన్ని రోజుల్లో 4జీ కనుమరుగవ్వనుంది. ఇప్పుడు వచ్చేవన్నీ 5జీ స్మార్ట్ ఫోన్లే. 5జీ స్పీడ్ ని అందుకోవాలంటే 5జీ స్మార్ట్ ఫోన్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు కనుక 5జీకి అప్గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్నట్లైతే కనుక.. లేదా బడ్జెట్ లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటే కనుక ఈ ఫోన్ మీ కోసమే. ఇటీవలే ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయ్యింది. ఐకూ జడ్9ఎక్స్ 5జీ ఫోన్ ని ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ మే 16న లాంఛ్ చేసింది అయితే ప్రస్తుతం ఈ ఫోన్ పై ఆఫర్ పెట్టింది. దీని అసలు ధర 18 వేలు అయితే 5 వేలు తగ్గింపుతో 13 వేలకే విక్రయిస్తోంది. 

ఐకూ జడ్9ఎక్స్ ఫీచర్స్:

ఫుల్ డే, ఫుల్లీ లోడెడ్ పెర్ఫార్మెన్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని రూపొందించారు. స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ఈ ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్.. ఫాస్టెస్ట్ ఫోన్ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 4 నానో మీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో, 8 కోర్ సీపీయూ ఆర్కిటెక్చర్, స్నాప్ డ్రాగన్ 6త్ జెన్ 1 ఓఎస్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని రూపొందించారు. ఐకూ జడ్9ఎక్స్ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంది. అలానే స్లిమ్ గా కూడా ఉంది. యూత్ కి ముఖ్యంగా అమ్మాయిలకి బాగా నచ్చేలా దీని డిజైన్ ఉంది. 7.99ఎంఎం స్లిమ్ డిజైన్ తో వస్తున్న ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే. 6000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో రెండు రోజుల వరకూ బ్యాటరీ పని చేస్తుంది. 7.9 గంటలు గేమ్ ఆడచ్చు, 21.26 గంటలు వీడియోలు చూడచ్చు. 30 గంటల సేపు సోషల్  మీడియా యాప్స్ బ్రౌజ్ చేయచ్చు. 71.5 గంటల సేపు కంటిన్యూగా మ్యూజిక్ వినవచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగానే ఉంది. 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 గంటల సేపు వీడియోలు చేసుకోవచ్చునని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.

ఇక దీని డిస్ప్లే విషయానికొస్తే.. 6.72 అంగుళాలతో 120 హెడ్జెస్ ఫుల్ హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 50 ఎంపీ ఏఐ కెమెరా, ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ టెక్నాలజీ ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ 14 వెర్షన్ ని ఉపయోగించారు.  రెండేళ్ల పాటు  ఆండ్రాయిడ్ అప్డేట్ తో అలానే మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్ తో వస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 1 టీబీ వరకూ స్టోరేజ్ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.

4 జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ అసలు ధర 17,999 రూపాయలుగా ఉంది. అయితే దీన్ని 12,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 6 జీబీ ర్యామ్ ఫోన్ 14,999 రూపాయలు పడుతుంది. దీని అసలు ధర 18,999 రూపాయలు. కానీ ఆఫర్ లో 14,999కే వస్తుంది. 8 జీబీ ర్యామ్ ఫోన్ అయితే 15,999 రూపాయలు పడుతుంది. దీని అసలు ధర రూ. 19,999. కానీ ఆఫర్ లో 4 వేలు తగ్గుతుంది. 8 జీబీ ర్యామ్ ఫోన్లు తప్పితే.. మిగతా ఫోన్లు 15 వేల లోపు బడ్జెట్ లో అందుబాటులో ఉండడం విశేషం. ఇక ఈ 5జీ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. టోర్నడో గ్రీన్, స్ట్రోమ్ గ్రే కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Show comments