iDreamPost
android-app
ios-app

World Cup: పాకిస్థాన్​పై జోకులు వేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్!

  • Author singhj Published - 01:48 PM, Sat - 14 October 23
  • Author singhj Published - 01:48 PM, Sat - 14 October 23
World Cup: పాకిస్థాన్​పై జోకులు వేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్!

వన్డే వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియాకు ఏదీ కలసిరావడం లేదు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆ టీమ్​ను వరుసగా రెండు పరాజయాలు పలకరించాయి. మెగా టోర్నీల్లో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన కంగారూలను మొదటి మ్యాచ్​లో టీమిండియా కంగారు పెట్టింది. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు 199 రన్స్​కే ఆలౌటైంది. ఛేజింగ్​లో ముగ్గురు ఇండియన్ బ్యాట్స్​మెన్​ను వెంట వెంటనే ఔట్ చేసినా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దెబ్బకు కంగారూలు తోకముడిచారు. ఆ మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్​లో కాస్త ఫైట్ చేసిన ఆసీస్.. సౌతాఫ్రికాతో మ్యాచ్​లోనైతే పూర్తిగా చేతులెత్తేసింది.

సఫారీలతో మ్యాచ్​లో ఏకంగా 134 రన్స్ తేడాతో ఆసీస్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ కమిన్స్ సేన దారుణంగా ఫెయిలైంది. గ్రౌండ్ ఫీల్డింగ్​ లోపాలతో పాటు క్యాచింగ్ మిస్టేక్స్​ ఆ టీమ్​కు శాపంగా మారాయి. ఇక ఈ మ్యాచ్​లో ఆసీస్ ఇన్నింగ్స్ టైమ్​లో డ్రెస్సింగ్ రూమ్​లో గ్లెన్ మ్యాక్స్​వెల్ సిగరెట్ తాగుతూ కనిపించిన సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంపై ఆసీస్ ప్యాట్ కమిన్స్ తనదైన శైలిలో స్పందించాడు. టాస్​తో సంబంధం లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా గెలిచే మార్గాన్ని త్వరగా కనుగొంటామన్నాడు. రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు ప్యాట్ కమిన్స్.

గత రెండు మ్యాచుల్లో సరిగ్గా ఆడలేకపోయామని, అందుకు జట్టులోని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని తెలిపాడు కమిన్స్. నెక్స్ట్ మ్యాచ్​కు కొంత రెస్ట్ దొరికిందన్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో చేసిన మిస్టేక్స్​ను మెరుగుపర్చుకొని నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. భారత్, సౌతాఫ్రికాపై భారీ ఓటములకు ఏం సమాధానం చెబుతారని ఒక జర్నలిస్ట్ కమిన్స్​ను క్వశ్చన్ చేశాడు. దీంతో ఆసీస్ కెప్టెన్ స్పందిస్తూ.. ‘దీనికి పాకిస్థాన్​ భారీ మూల్యం చెల్లించుకుంటుంది’ అని జోక్ చేశాడు. కమిన్స్​ జోక్​కు అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. నాలుగో మ్యాచ్​లో పాక్​తో తలపడనుంది ఆసీస్. ఆ మ్యాచ్​లో బాబర్ సేనను చిత్తు చేస్తామనే ఉద్దేశంతోనే కమిన్స్ ఈ కామెంట్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అయితే పాక్ ఫ్యాన్స్ మాత్రం పరువు తీసేందుకు తమ టీమే దొరికిందా అని సీరియస్ అవుతున్నారు.

ఇదీ చదవండి: ఔటయ్యాక మ్యాక్స్​వెల్ వింత పని! వైరల్ అవుతున్న వీడియో!

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)