iDreamPost

అవుట్ అయ్యాక మ్యాక్స్ వెల్ వింత పని! వైరల్ అవుతున్న వీడియో!

  • Author singhj Updated - 05:19 PM, Sat - 14 October 23
  • Author singhj Updated - 05:19 PM, Sat - 14 October 23
అవుట్ అయ్యాక మ్యాక్స్ వెల్ వింత పని! వైరల్ అవుతున్న వీడియో!

వన్డే వరల్డ్‌ కప్-2023లో ఆస్ట్రేలియా తప్ప మిగిలిన బిగ్ టీమ్స్ అన్నీ ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు ఆడుతున్నాయి. కంగారూలు మాత్రం అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్రపంచ కప్​కు సన్నాహకంగా భారత్​తో వన్డే సిరీస్ ఆడినా కూడా మెగా టోర్నీలో ఆ ఎక్స్​పీరియెన్స్​ను చూపించలేకపోతున్నారు. వరల్డ్ కప్​లో ఆడిన మొదటి మ్యాచ్​లోనే టీమిండియా చేతిలో ఓడింది ఆసీస్. ఆ మ్యాచ్​లో బ్యాటింగ్​లో ఫ్లాప్ అయిన కమిన్స్ సేన.. బౌలింగ్ బాగానే చేసింది. ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే టీమిండియాపై ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు.

టీమిండియా మీద ఫైట్ చేసి ఓడిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచులోనైతే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో కనీస పోరాటం ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఆ మ్యాచ్​లో ఏకంగా 134 రన్స్ తేడాతో ఓడి మెగా టోర్నీలో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదుసార్లు వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ఇలాంటి దుస్థితి రావడం ఏంటని కంగారూ టీమ్​ ఫ్యాన్స్​తో పాటు క్రికెట్ అభిమానులు అందరూ షాకవుతున్నారు. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్​లో ఆసీస్ ఫెయిలవ్వడంపై సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ టీమ్ ఫీల్డింగ్ చూసి.. అసలు గ్రౌండ్​లో ఉంది ఆస్ట్రేలియానేనా? అని ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు వరుస ఓటములతో ఆసీస్ డీలాపడిన టైమ్​లో ఆ జట్టు పరువు తీసేశాడు గ్లెన్ మ్యాక్స్​వెల్. సౌతాఫ్రికాతో మ్యాచ్​లో 312 రన్స్ ఛేజింగ్ చేసే క్రమంలో ఆసీస్ 70 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. టీమ్ స్కోర్ 80/6 వద్ద ఉన్నప్పుడు మ్యాక్స్​వెల్ డ్రెస్సింగ్ రూమ్​ బయట స్మోక్ చేస్తూ కనిపించాడు. గ్రౌండ్​లోని కెమెరాలు కంగారూ డ్రెస్సింగ్ రూమ్​ వైపుగా తిప్పడంతో మ్యాక్సీ సిగరెట్ తాగుతుండటం బయటపడింది. ఈ స్టార్ ఆల్​రౌండర్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్​లో స్మోకింగ్ చేయడానికి పర్మిషన్ ఉందా? అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆసీస్ కాదు క్రికెట్ పరువు తీశావంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో స్మోక్ మ్యాక్సీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. డ్రెస్సింగ్ రూమ్​లో మ్యాక్స్​వెల్ చేసిన పనిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కేన్​ విలియమ్సన్​ను వదలని శని.. ఇలా వచ్చాడో లేదో వెంటనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి