Keerthi
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వినేశ్ మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లో అరంగేట్రం చేయన్నుట్లు టాక్ వినిపిస్తుంది.
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వినేశ్ మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లో అరంగేట్రం చేయన్నుట్లు టాక్ వినిపిస్తుంది.
Keerthi
వినేశ్ ఫొగాట్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు ఎంతలా మారు మోగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల రెజ్లింగ్ విభాగంలో.. వినేశ్ కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉన్న కారణంతో.. పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీంతో వినేశ్ ఫొగాట్ పై యావత్త్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడి దగ్గర నుంచి పలువురు సినీ సెలబ్రిటీస్, నెటిజన్స్ వినేశ్ కు అండగా నిలిచిన తమ మద్దతును తెలిపారు.
ఇక ఈ ఘటన జరిగిన తర్వాత వినేశ్ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా వినేశ్ ఫొగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారని సమాచారం వినిపిస్తుంది. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
తాజాగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు టాక్ జోరుగా వినిపిస్తుంది. ముఖ్యంగా వినేశ్ ఆమె సోదరి బబిత ఫొగాట్‌పైనే నేరుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక వినేశ్ ఫొగాట్ రాజకీయ అరంగేంట్రం పై ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు.ఈ క్రమంలోనే.. వినేశ్ ఫొగాట్ రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్నకు.. ఆమె సన్నిహితులు దగ్గర నుంచి అవును అనే సమాధానం వచ్చింది. అంతేకాకుండా.. వినేశ్ ఫొగాట్.. రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని, రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో.. వినేశ్ ఫొగాట్ వర్సెస్ బబితా ఫొగాట్ అనే విధంగా ఉండొచ్చని వారు మరింత స్పష్టతను ఇచ్చారు.
అయితే గతంలో వినేశ్ ఫొగాట్ తాను రాజకీయాల్లోకి రానని ప్రకటించింది. కానీ, ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదించి.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ, ఇంతకీ వినేశ్ ఫొగాట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో, ఏ పార్టీలో చేరుతారో అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే వినేనశ్ ఫొగాట్ సోదరి బబితా ఫొగాట్ 2019లో బీజేపీలో చేరింది. దీంతో అదే ఏడాది హర్యానాలో జరిగిన ఎన్నికల్లో దాద్రి స్థానం నుంచి పోటీ చేసిన బబితా పరాజయం పాలయ్యారు.ఈ నేపథ్యంలోనే.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే బబితా ఫొగాట్ పై వినేశ్ పోటీ చేయనున్నారని సమాచారం వినిపిస్తుంది. మరీ, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రాజకీయాల్లోకి అరగేంట్రం చేయనున్నారనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.