iDreamPost
android-app
ios-app

Muthyalamma Idol: అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కీలక విషయాలు వెల్లడించిన నార్త్ జోన్ DCP!

North Zone DCP On Muthyalamma Idol Vandalisam: సికింద్రాబాద్ ప్రాంతంలోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ధ్వంసం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

North Zone DCP On Muthyalamma Idol Vandalisam: సికింద్రాబాద్ ప్రాంతంలోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ధ్వంసం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

Muthyalamma Idol: అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కీలక విషయాలు వెల్లడించిన నార్త్ జోన్ DCP!

ప్రస్తుతం హైదరాబాద్ లో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిని విగ్రహం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దాడి చేసిన నిందితుడిని స్థానికులు అప్పుడే పట్టుకున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇప్పుడు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. కేసు దర్యాప్తునకు సంబంధించి కూడా పలు కీలక విషయాలను వెల్లడించారు.

అమ్మవారి విగ్రహం ధ్వంసం కేసుకు సంబంధించి నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. ” ప్రస్తుతం ఇక్కడి వాతావరణం సద్దుమణిగింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి స్థానికులు కూడా కోపరేట్ చేస్తున్నారు. నిందితుడు ఇప్పుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి అన్నీ కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా జరుపుతున్నాం. ఘటన జరిగినప్పటి నుంచి నేను మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాను. త్వరలోనే ఈ ఇష్యూకి సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేయబోతున్నాం. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదు. ఉగ్రవాద సంస్థనో.. ఏదైనా కమ్యూనిటీనో ఈ ఘటనకు కారణం కాదు. ఇది కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేసిన చర్య. ఈ కేసుకు సంబంధించి అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. స్థానికులు లేవనెత్తిన అనుమానాలు, వాళ్లు చెప్పిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అన్నీ కోణాల్లో కేసు దర్యాప్తు జరుగుతోంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండండి. నిందితుడికి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యం కాస్త విషయంగానే ఉంది. ఈ విషయానికి సంబంధించి ఎవరూ తప్పుడు ప్రచారాలను నమ్మకండి. ఎలాంటి అపోహలు, అవాస్తలను ప్రచారం చేయకండి” అంటూ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ విజ్ఞప్తి చేశారు.

అసలు ఈ విగ్రహం ధ్వంసం కేసులో ఏం జరిగిందో చూద్దాం.. సికింద్రాబాద్ పోస్టాఫీస్ సమీపంలోనే ఈ గుడి ఉంది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి నడుచుకుంటూ గుడిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత గర్భగుడి తలుపులు పగలగొట్టాడు. లోపల ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి మోండా మార్కెట్ పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు మొదటి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నిమ్స్ కు తరలించారు. ఈ విషయం తెలియగానే హిందూ సంఘాలు, బీజేపీ లీడర్లు ధర్నాకు దిగారు. నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేశారు. తరచూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సందర్శించారు. స్థానికులు సహా నేతలు కూడా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.