iDreamPost
android-app
ios-app

Lady Aghori: లేడీ అఘోరీకి గురువు వార్నింగ్.. ఇకపై మీడియాకి దూరంగా ఉంటానంటూ..!

Lady Aghori Guru Serious On Her Interviews: లేడీ అఘోరీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె హరిద్వార్ లో ఉన్నట్లు తెలిపింది. తన గురువును కలిసినట్లు వెల్లడించింది. ఆయన మీడియా ఇంటర్వ్యూల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారట.

Lady Aghori Guru Serious On Her Interviews: లేడీ అఘోరీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె హరిద్వార్ లో ఉన్నట్లు తెలిపింది. తన గురువును కలిసినట్లు వెల్లడించింది. ఆయన మీడియా ఇంటర్వ్యూల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారట.

Lady Aghori: లేడీ అఘోరీకి గురువు వార్నింగ్.. ఇకపై మీడియాకి దూరంగా ఉంటానంటూ..!

లేడీ అఘోరీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవిడే సంచలనం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ గుడికి ఒకరోజు సడెన్ గా అఘోరీ వచ్చింది. కారులో నుంచి దిగి.. అమ్మవారి గుడిలో పూజలు చేసింది. దాదాపు 40 నిమిషాల పాటు అమ్మవారి ఆలయంలో వివిధ పూజలు చేసింది. ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన దోషానికి పరిహారం చేసినట్లు ఆవిడ తెలిపారు. అప్పటి నుంచి అందరూ లేడీ అఘోరీ గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆవిడ నేరుగా మీడియాతో మాట్లాడటం కూడా చూశాం. పలు ఛానల్స్ కు లేడీ ఆఘోరీ ఇంటర్వ్యూలు ఉచ్చారు. తన గతం గురించి, తాను భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి ఇలా చాలానే విషయాలను పంచుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూల వల్ల ఆవిడక ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే లేడీ అఘోరీకి ఆయన గురువు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

లేడీ అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. లెక్కకు మించిన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సమయంలో ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు నెగిటివ్ గా కూడా వెళ్లాయి. అసలు ఆవిడ మహిళ కాదని.. హిజ్రా అనే కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. ఒకసారి ఆవిడ అరెస్టు అయ్యింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. వాటిని అఘోరీ ఖండించింది. తనని ఎవరూ అరెస్టు చేయలేదంటూ వెల్లడించింది. తన గురువు దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేసింది. నిజానికి అఘోరీ ఆలయం ప్రారంభోత్సవానికి గుజరాత్ వెళ్లాల్సి ఉంది. తాను గుజరాత్ వెళ్తున్నాను అని చెప్పుకొచ్చింది.

అయితే తెలంగాణలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తన గురువు విశ్వనాథ శాస్త్రి పిలిచారని వెల్లడించారు. గురవు పిలుపు నేపథ్యంలో హరిద్వార్ కు వెళ్లారు. ఇప్పుడు కేదార్ నాథ్ బోర్డు వద్ద నుంచి వీడియో రిలీజ్ చేశారు. తాను హరిద్వార్ లో తన గురువును కలిసిన విషయాన్ని వెల్లడించారు. అయితే తన గురువు ఈ మీడియా ప్రచారంలో విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. అసలు ఎందుకు మీడియా ముందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారట. అఘోరాలకు కొన్ని నియమాలు ఉంటాయని.. వాటి ప్రకారం మీడియాతో మాట్లాడకూడదని సూచించారు. ఎందుకు మీడియా ప్రచారం చేస్తున్నారు? మీ పని మీరు చేసుకోండి. ఇలా సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం ఏముందని అఘోరీని గురువు హెచ్చరించినట్లు తెలిపారు.

గుజరాత్ వెళ్లాల్సిన అఘోరీ.. గురువు పిలుపుతో హరిద్వార్ చేరుకుంది. మా సంకల్పం ఏంటి అనేది.. ఏం చేయబోతున్నాం అనేది మీడియాకి చెప్పక్కర్లేదు అన్నారట. అవన్నీ వారి నియమాలకు విరుద్ధమని తెలిపారు. అఘోరీ వ్యవస్థలో మీడియా ముందుకు వచ్చిన వాళ్లు లేరని చెప్పుకొచ్చారు. తన గురువుకు పాదాభివందనం చేస్తూ.. క్షమాపణ కోరుతూ.. శిక్షణ ఇచ్చిన పరంగానే ముందుకు వెళ్తాను అంటూ చెప్పానన్నారు. ఎంత నెగిటివిటీ వచ్చినా వెళ్లిన పని పూర్తి చేసుకోవాలని సూచించారట. లేడీ అఘోరీ ప్రస్తుతం కేదార్ నాథ్ వెళ్తున్నారు. అక్కడ శివయ్య దర్శనం చేసుకుని తిరిగి తెలంగాణ వస్తారట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.