iDreamPost
android-app
ios-app

Chennai Rains: భారీ వర్షాలు.. ఇళ్లు వదిలేసి హోటళ్లకు క్యూ కడుతున్న చెన్నై వాసులు!

Chennai Rains- Huge Demand For Luxury Hotels: చెన్నైలో వర్షాలు వాయించేస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి వర్షపు నీరు వస్తుందో అని అంతా బెదిరిపోతున్నారు. గతేడాది తరహాలో ఎక్కడ వరదలు వస్తాయో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.

Chennai Rains- Huge Demand For Luxury Hotels: చెన్నైలో వర్షాలు వాయించేస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి వర్షపు నీరు వస్తుందో అని అంతా బెదిరిపోతున్నారు. గతేడాది తరహాలో ఎక్కడ వరదలు వస్తాయో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.

Chennai Rains: భారీ వర్షాలు.. ఇళ్లు వదిలేసి హోటళ్లకు క్యూ కడుతున్న చెన్నై వాసులు!

దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరం దాటింది. అప్పటి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో.. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడల్లా ఈ వర్షాలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం నదులను తలపిస్తున్నాయి. చాలా వరకు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికీ ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. చెన్నైవాసులు మాత్రం వణికిపోతున్నారు. అసలు చెన్నైలో ఏం జరుగుతోంది? ఎందుకు అక్కడి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారో తెలుసుకుందాం.

చెన్నై నగరం మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అందరు గతేడాది డిసెంబర్ నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఇదే తరహాలో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. ఎక్కడ చూసినా వర్షపు నీరు. ఇళ్లు మొత్తం వరద నీటితో మునిగిపోయింది. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి దృశ్యాలు ఇప్పటికీ చెన్నై వాసుల కళ్ల ముందే మెదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై వాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే మూడ్రోజులుగా చెన్నైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. చాలామంది ఫ్లై ఓవర్స్ మీద తమ కార్లను పార్క్ చేసుకుంటున్నారు. కొందరైతే గుమ్మాల ముందు సిమెంట్ తో చిన్న చిన్న గోడలు కట్టుకుంటున్నారు.

ఇదంతా కొందరి పరిస్థితి.. కానీ మరికొంత మంది మాత్రం హోటళ్లకు క్యూ కడుతున్నారు. అవును.. ధనవంతులు, టెకీలు చెన్నైలో ఉన్న హోటల్స్ కు మకాం మార్చేస్తున్నారు. ఇంటిల్లిపాది మొత్తం హోటల్స్ కు వెళ్లిపోతున్నారు. ఇంటికి తాళాలు వేసేసి.. హోటల్స్ కి వెళ్లిపోతున్నారు. ధనవంతులు విలాసవంతమైన హోటల్స్ కు వెళ్తున్నారు. టెకీలు కూడా.. కరెంట్, వైఫై, కార్ పార్కింగ్, వాటర్ సప్లై ఉండే హోటల్స్ లో దిగుతున్నారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా.. వర్షాల నుంచి తప్పించుకోవాలి అని హోటళ్లకు పరిగెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని హోటళ్లకు డిమాండ్ పెరిగింది. ధరలు కూడా సాధారణం కంటే అధికంగానే ఉన్నాయి అంటున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తడంతో.. హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మంచి వసతులు ఉన్న హోటల్స్ లో గదులు ఖాళీ ఉండటం లేదు. ఈ వర్షాలు ఆగేంత వరకు చాలా మంది హోటల్స్ లో ఉండేందుకు ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే వారికి కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఈ వర్షాల నేపథ్యంలో చోరీల భయం పట్టుకుంది. అందరూ హోటల్స్ కి వెళ్తే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎవరూ లేరని తెలుసుకుని దొంగతనాలు చేస్తారేమో అని కొందరు కంగారు పడుతున్నారు. అటు వర్షాలకు హోటల్స్ కి వెళ్తే.. ఇంటి దగ్గర ఏం అవుతుందో అనే టెన్షన్ పట్టుకుంది అంటున్నారు. మరి.. చెన్నై వాసుల పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.