iDreamPost
android-app
ios-app

భారత్ ఆతిథ్యానికి పాక్ క్రికెటర్లు ఫిదా.. ఇలాంటి స్వాగతం ఎప్పుడూ చూడలేదంటూ..!

  • Author singhj Published - 02:08 PM, Thu - 28 September 23
  • Author singhj Published - 02:08 PM, Thu - 28 September 23
భారత్ ఆతిథ్యానికి పాక్ క్రికెటర్లు ఫిదా.. ఇలాంటి స్వాగతం ఎప్పుడూ చూడలేదంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023కి టైమ్ దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనే టీమ్స్ ఒక్కొక్కటిగా ఇండియాకు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు భారత గడ్డ మీదకు అడుగుపెట్టింది. ఏడేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది దాయాది టీమ్. అయితే హైదరాబాద్​లో విమానం దిగిన పాకిస్థాన్ క్రికెటర్లకు భారత్​లో ఘనస్వాగతం లభించింది. శత్రుదేశంగా భావించే పాక్​కు చెందిన ప్లేయర్లకు ఇక్కడ అద్భుతమైన అతిథి మర్యాదలు అందుతున్నాయి. వరల్డ్ కోసం విచ్చేసిన పాక్ క్రికెట్ టీమ్​కు శంషాబాద్ ఎయిర్​పోర్టులో వందలాది మంది అభిమానులు స్వాగతం పలికారు.

శంషాబాద్ ఎయిర్​పోర్టు నుంచి బస్సులో హోటల్​కు చేరుకుంది పాక్ జట్టు. అయితే అక్కడ హోటల్ స్టాఫ్ వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు మరికొందరు ఆటగాళ్లకు కాషాయ రంగులోని శాలువాలు కప్పి వెల్​కమ్ చెప్పారు. అటు ఎయిర్​పోర్ట్​లో ఫ్యాన్స్ ప్రేమకు పులకరించిపోయిన దాయాది క్రికెటర్లు.. ఇటు హోటల్​ సిబ్బంది స్వాగతానికి ఫిదా అయిపోయారు. ఇక పాక్ అభిమానుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తమ క్రికెటర్లకు హైదరాబాద్​లో సాదర స్వాగతం లభించిందని చెబుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ట్విట్టర్​లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇది వైరల్​గా మారడంతో థ్యాంక్యూ ఇండియా అంటూ పాకిస్థానీలు స్పందిస్తున్నారు.

ఒక పర్యాటక జట్టుకు ఇంత గొప్ప ఆతిథ్యం లభించడం ఎప్పుడూ చూడలేదని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి వస్తే భారత్​కు కూడా ఇదే తరహాలో, ఇంతే ఎనర్జీతో వెల్​కమ్ చెబుతామని పాక్ అభిమానులు అంటున్నారు. ఇండియాకు తాము బాకీ పడ్డామని.. మీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ ఒక పాకిస్థానీ ట్వీట్ చేశాడు. అనేక మంది పాక్ ఫ్యాన్స్ భారత్​కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తుండటంతో.. ట్విట్టర్​లో ఇప్పుడు ‘థ్యాంక్స్ ఇండియా’ అనే ట్యాగ్ ట్రెండింగ్​ అవుతోంది. మరి.. పాక్ క్రికెటర్లకు హైదరాబాద్​లో దక్కిన ఘనస్వాగతంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్​పై సిరీస్ గెలిచినా.. కప్పు ముట్టుకోని రోహిత్!