iDreamPost
android-app
ios-app

Rohit Sharma: కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత బయటకు వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం..!

  • Published Dec 20, 2023 | 4:45 PM Updated Updated Dec 20, 2023 | 4:45 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వచ్చే సీజన్​లో ఆ టీమ్ గ్రౌండ్​లో దిగేటప్పుడు ఇదింకా ఎక్కువయ్యేలా ఉంది. అయితే ఈ కాంట్రవర్సీ తర్వాత రోహిత్ శర్మ మరోమారు బయటకు వచ్చాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వచ్చే సీజన్​లో ఆ టీమ్ గ్రౌండ్​లో దిగేటప్పుడు ఇదింకా ఎక్కువయ్యేలా ఉంది. అయితే ఈ కాంట్రవర్సీ తర్వాత రోహిత్ శర్మ మరోమారు బయటకు వచ్చాడు.

  • Published Dec 20, 2023 | 4:45 PMUpdated Dec 20, 2023 | 4:45 PM
Rohit Sharma: కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత బయటకు వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం..!

ఇప్పుడు అంతా ఐపీఎల్ సందడి నడుస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్​ మొదలవడానికి ఇంకా చాలా రోజుల టైమ్ ఉంది. కానీ ప్లేయర్ల రిటెన్షన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం, ఆ తర్వాత మినీ వేలం జరగడంతో ఎక్కడ చూసినా ఈ లీగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఆక్షన్​లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ప్యాట్ కమిన్స్ (రూ.20.50 కోట్లు), మిచెల్ స్టార్క్ (24.75 కోట్లు) ఆక్షన్​లో ఊహించని ధరకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరిచారు. స్టార్క్ అయితే 16 ఏళ్ల లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్​గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆక్షన్​లో మిగిలిన ప్లేయర్లు ఎంత ధర పలికారనే విషయాలను ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్ అవుతోంది.

సౌతాఫ్రికా టూర్​లో ఉన్న రోహిత్ తాజాగా దిగిన ఒక ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. శుబ్​మన్ గిల్​తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్​తో కలసి సరదాగా బయటకు వచ్చాడు హిట్​మ్యాన్. ఈ సందర్భంగా వీళ్లు ముగ్గురూ కలసి ఓ రెస్టారెంట్​లో ఒక ఫొటో దిగారు. అయితే ఈ ఫొటోలో దిలీప్ నార్మల్​గానే ఉన్నాడు. గిల్ ఏదో తింటూ నవ్వుతూ కనిపించాడు. కానీ హిట్​మ్యాన్ మాత్రం తన చేతి వేలిని కెమెరా వైపు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ సరదాగా పోజు ఇచ్చాడా? లేదా ఎవర్నయినా హెచ్చరించేందుకు ఇన్​డైరెక్ట్​గా ఇలా అన్నాడా? అనేది తెలియదు. కానీ నెటిజన్స్ మాత్రం ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్​ హార్దిక్ పాండ్యాకు హిట్​మ్యాన్​ మాస్ వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. కెప్టెన్సీ కోసం తనకు ద్రోహం చేశాడని.. అందుకే పాండ్యాను హెచ్చరిస్తూ అలా పోజు ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.

ముంబై కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత రోహిత్ బయటకు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు తన కూతురు చదువుకుంటున్న ధీరూబాయ్ అంబానీ స్కూల్ ఫంక్షన్​లో భార్య రితికా సజ్దేతో కలసి పాల్గొన్నాడతను. ఈ స్కూల్ ప్రోగ్రామ్​కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోల్లో ఇటు హిట్​మ్యాన్​తో పాటు అటు అతడి భార్య రితికా కూడా చాలా డల్​గా కనిపించారు. అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేశారనే బాధ, ఎంఐ తనను అవమానించిందనే అసహనం రోహిత్​తో పాటు రితికా ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మరోమారు బయటకు వచ్చాడు హిట్​మ్యాన్. సఫారీ టూర్​లో టెస్టులు ఆడేందుకు వెళ్లిన అతడు.. సిరీస్​ స్టార్ట్ అవడానికి ఇంకా టైమ్ ఉండటంతో గిల్​తో కలసి బయటకు వచ్చాడు. అయితే అతడు ఇంటెన్స్​గా, వార్నింగ్ ఇస్తున్నట్లు పోజులతో ఫొటోలు దిగడంతో మళ్లీ ముంబై కెప్టెన్సీ ఇష్యూ వైరల్​గా మారింది. మరి.. రోహిత్ వార్నింగ్ ఎవరికి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Robin Minz: పదో తరగతితో చదువు బంద్.. అయినా రూ.కోట్లు కొల్లగొట్టాడు! ఎవరీ రాబిన్ మింజ్?