క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ రానే వచ్చింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్ కప్ 2023 జరగనుంది. ఈసారి వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇవ్వనున్నది భారత్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈసారి ఎక్కడ ఎక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయంటే.. హైదరాబాద్ మొదలు.. అహ్మదాబాద్, ధర్మశాల, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్క కతా, లక్నో, ముంబయి, పూణెల్లో మ్యాచెస్ జరగనున్నాయి. హైదరాబాద్ లో మొత్తం 3 మ్యాచెస్ జరగబోతున్నాయి. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లాడ్- న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
ఈ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో భారత్- పాక్ మ్యాచ్ ల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే భారత్ ఆటగాళ్లు పాకిస్థాన్ లో మ్యాచెస్ ఆడటం ఆపేసి చాలా ఏళ్లు అవుతోంది. అలాగే పాకిస్థాన్ కూడా భారత్ పర్యటనలను ఆపేసింది. ఇప్పుడు వరల్డ్ కప్ భారత్ లో కావడంతో తమ మ్యాచెస్ న వేరే ప్రాంతంలో పెట్టాలంటూ కోరుకుంది. కావాలంటే టోర్నీని కూడా వదిలేస్తామంటూ కామెంట్ చేశారు. కానీ, తప్పక పీసీబీ దిగొచ్చింది.
ఇండియాలో మ్యాచెస్ ఆడేందుకు ఓకే చెప్పింది. ఇచ్చిన వెన్యూస్ లో తమ మ్యాచెస్ ని మార్చాలంటూ ఒక రిక్వెస్ట్ పెట్టింది. కానీ, బీసీసీఐ అందుకు నో చెప్పింది. సరైన కారణం లేకుండా మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. అక్టోబర్ 15న భారత్- పాక్ మధ్య మ్యాచ్ అహ్మదా బాద్ వేదికగా జరగనుంది. ఈసారి లీగ్ ని రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. అంటే ఇందులో గ్రూప్ మ్యాచెస్ ఉండవు. ప్రతి టీమ్ 9 లీగ్ మ్యాచెస్ ఆడతుంది. అత్యుత్తమ 4 జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తాయి. ఆపై చివరిగా రండు అత్యుత్తమ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది.