iDreamPost
android-app
ios-app

హార్దిక్​కు సర్​ప్రైజ్ ఇచ్చిన BCCI.. ఇన్నాళ్ల కష్టానికి తగిన గుర్తింపు!

  • Published Sep 21, 2024 | 7:37 AM Updated Updated Sep 21, 2024 | 7:37 AM

Hardik Pandya, BCCI, Team India: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఓన్లీ టీ20ల్లోనే కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత శ్రీలంక టూర్​కు వెళ్లిన పాండ్యా.. అక్కడ కేవలం టీ20 సిరీస్​కే పరిమితమయ్యాడు.

Hardik Pandya, BCCI, Team India: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఓన్లీ టీ20ల్లోనే కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత శ్రీలంక టూర్​కు వెళ్లిన పాండ్యా.. అక్కడ కేవలం టీ20 సిరీస్​కే పరిమితమయ్యాడు.

  • Published Sep 21, 2024 | 7:37 AMUpdated Sep 21, 2024 | 7:37 AM
హార్దిక్​కు సర్​ప్రైజ్ ఇచ్చిన BCCI.. ఇన్నాళ్ల కష్టానికి తగిన గుర్తింపు!

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య కేవలం టీ20ల్లోనే కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత శ్రీలంక టూర్​కు వెళ్లిన పాండ్యా.. అక్కడ కేవలం టీ20 సిరీస్​కే పరిమితమయ్యాడు. వన్డే సిరీస్​కు అతడ్ని సెలెక్ట్ చేయలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​కు కూడా అతడ్ని ఎంపిక చేయలేదు. పాండ్యాకు ఏ గాయమూ లేదు. అతడు ఫిట్​గానే ఉన్నాడు. అయినా నేషనల్ డ్యూటీకి దూరంగా ఉంచారు. భారత స్టార్లంతా ఆడిన దులీప్ ట్రోఫీకీ అతడ్ని ఎంపిక చేయలేదు. దీంతో పాండ్యాను ఇక మీదట ఒకే ఫార్మాట్​కు పరిమితం చేస్తారా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ల డౌట్స్​కు ఫుల్​స్టాప్ పెట్టింది భారత క్రికెట్ బోర్డు. హార్దిక్​కు బీసీసీఐ సడన్ సర్​ప్రైజ్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డేలకు, టెస్టులకు దూరంగా ఉంటున్న పాండ్యాను అక్టోబర్ 11 నుంచి మొదలయ్యే రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా బీసీసీఐ ఆదేశించిందని తెలుస్తోంది. డొమెస్టిక్ సీజన్ 2024-25లో పాల్గొని ఫామ్, ఫిట్​నెస్​ను నిరూపించుకోవాలని సూచించిందట. ముఖ్యంగా బౌలింగ్​ ఫిట్​నెస్​ను ప్రూవ్ చేసుకోవాలని తెలిపిందట. లాంగ్ స్పెల్స్ వేయడంపై ఫోకస్ చేయాలని బోర్డు పెద్దలు స్టార్ ఆల్​రౌండర్​కు చెప్పినట్లు సమాచారం. రంజీ ట్రోఫీలో రాణిస్తే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్​తో పాటు ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అతడ్ని ఆడించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయాన్ని హార్దిక్ డొమెస్టిక్ టీమ్​కు చెందిన బరోడా క్రికెట్ అసోసియేషన్​లోని ఓ సీనియర్ అధికారి కన్ఫర్మ్ చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక, లంక సిరీస్​కు మొదలవడానికి ముందు టీమిండియా టీ20 టీమ్​కు కొత్త కెప్టెన్​గా సూర్యకుమార్ యాదవ్​ను నియమిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ రేసులో హార్దిక్​ ఉన్నా.. అతడి ఫిట్​నెస్​ ఇష్యూస్​ను పరిగణనలోకి తీసుకొని కెప్టెన్సీ ఇవ్వలేదని స్వయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఇదే సాకు చూపి లంకతో వన్డే సిరీస్​కు అతడ్ని ఎంపిక చేయలేదు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తే ఇంజ్యురీ బారిన పడే రిస్క్ ఉందంటూ వన్డేలతో పాటు టెస్టులకూ పక్కనబెట్టారు. అయితే పట్టువదలకుండా ఫిట్​నెస్​ పెంచుకోవడంపై పనిచేసిన హార్దిక్ ఇప్పుడు ఆ విషయంలో బెటర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంజీ సీజన్​లో ఆడి బౌలింగ్, బ్యాటింగ్​లో​ ఫామ్, ఫిట్​నెస్​ నిరూపించుకోమని బీసీసీఐ నుంచి ఇండికేషన్స్ వెళ్లాయట. ఇది తెలిసిన నెటిజన్స్ అతడి కష్టం వృథా పోలేదని.. టెస్ట్ కమ్​బ్యాక్ త్వరలోనే ఉంటుందని అంటున్నారు. మరి.. హార్దిక్​ను తిరిగి లాంగ్ ఫార్మాట్​లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.