iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీతో అనుకున్నది సాధించిన BCCI.. 5 మంది స్టార్లను పట్టేసింది!

  • Published Sep 23, 2024 | 9:12 PM Updated Updated Sep 23, 2024 | 9:12 PM

Standout Players from Duleep Trophy 2024: భారత క్రికెట్ బోర్డు అనుకున్నది సాధించింది. డొమెస్టిక్ క్రికెట్​ను సీరియస్​గా తీసుకున్న బోర్డు.. ఏం చేయాలో అది చేసి చూపించింది. 5 మంది ఫ్యూచర్ స్టార్లను పట్టేసింది.

Standout Players from Duleep Trophy 2024: భారత క్రికెట్ బోర్డు అనుకున్నది సాధించింది. డొమెస్టిక్ క్రికెట్​ను సీరియస్​గా తీసుకున్న బోర్డు.. ఏం చేయాలో అది చేసి చూపించింది. 5 మంది ఫ్యూచర్ స్టార్లను పట్టేసింది.

  • Published Sep 23, 2024 | 9:12 PMUpdated Sep 23, 2024 | 9:12 PM
దులీప్ ట్రోఫీతో అనుకున్నది సాధించిన BCCI.. 5 మంది స్టార్లను పట్టేసింది!

ఒకప్పుడు భారత్​లో డొమెస్టిక్ క్రికెట్​కు మంచి ఇంపార్టెన్స్ ఉండేది. ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు వీటికి కూడా అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ ఉండేది. దేశవాళీల్లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు నెక్స్ట్ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తారనే హెల్తీ డిస్కషన్స్ నడిచేవి. సచిన్ నుంచి ధోని వరకు ఎందరో స్టార్లు ఇక్కడ ఆడే వెలుగులోకి వచ్చారు. అయితే ఐపీఎల్ ఎంట్రీతో డొమెస్టిక్ గురించి మాట్లాడటం తగ్గిపోయింది. ధనాధన్ క్రికెట్​కు ప్రాముఖ్యత పెరగడంతో దేశవాళీ ఆటగాళ్లకు గుర్తింపు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని డిసైడ్ అయిన భారత క్రికెట్ బోర్డు.. ఆ దిశగా సక్సెస్​ఫుల్​గా అడుగులు వేసింది. దులీప్ ట్రోఫీ-2024ను విజయవంతం చేయడమే గాక ఈ టోర్నీ నుంచి ఐదుగురు ఫ్యూచర్ స్టార్లను పట్టేసింది.

టీమిండియాకు ఆడే ప్రతి ప్లేయర్ నేషనల్ డ్యూటీ లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనంటూ ఈ మధ్య కొత్త రూల్ తీసుకొచ్చింది బీసీసీఐ. దులీప్ ట్రోఫీ నుంచి దాన్ని విజయవంతంగా అమల్లో పెట్టింది. రోహిత్ శర్మ, జస్​ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ తప్ప దాదాపుగా అందరు భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడారు. వీళ్లతో పాటు చాలా మంది యంగ్​స్టర్స్ టోర్నీలో పాల్గొన్నారు. దులీప్ ట్రోఫీ ద్వారా ఫామ్, ఫిట్​నెస్ చాటుకున్న వారిని బంగ్లాదేశ్​ సిరీస్​కు సెలెక్ట్ చేసింది బీసీసీఐ. అలాగే ఇందులో టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మరికొందర్ని గుర్తించిన బోర్డు.. వారిని సానబెట్టాలని చూస్తోంది. మరి.. బీసీసీఐ రాడార్​లో ఉన్న ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరు? టీమిండియా ఫ్యూచర్​కు ఎంతో కీలకంగా భావిస్తున్న ఆ యంగ్​స్టర్స్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రికీ భుయ్

దులీప్ ట్రోఫీలో దుమ్మురేపిన వారిలో తెలుగుతేజం రికీ భుయ్ ఒకడు. ఇండియా-డీ తరఫున ఆడిన అతడు మూడు మ్యాచుల్లో కలిపి 71.80 యావరేజ్​తో 359 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక ఫిఫ్టీ కూడా ఉంది. అతడి బెస్ట్ స్కోరు 119 నాటౌట్. ఫస్ట్ డౌన్​లో బ్యాటింగ్​కు దిగుతూ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేస్తూ పోయాడు రికీ భుయ్. మిడిలార్డర్ బ్యాటర్లతో కలసి జట్టు భారీ స్కోర్లు అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ముషీర్ ఖాన్

టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు అయిన ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ ఆరంభంలో రచ్చ చేశాడు. ఇండియా-బీ తరఫున బరిలోకి దిగిన ముషీర్.. ఇండియా-ఏతో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో భారీ సెంచరీ బాదాడు. 181 పరుగులు చేసి తన టాలెంట్ ఏంటో చూపించాడు. క్లాస్, మాస్ మిక్స్ అతడు ఆడిన తీరు.. ఇన్నింగ్స్​ను నడిపించిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. అతడు ఇలాగే ఆడితే అన్నలాగే త్వరలోనే టీమిండియా గడప తొక్కడం ఖాయం.

అభిమన్యు ఈశ్వరన్

ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో టన్నుల కొద్దీ పరుగులు, లెక్కకు మించి రికార్డులు క్రియేట్ చేసి తోపు బ్యాటర్​గా పేరు తెచ్చుకున్నాడు అభిమన్యు ఈశ్వరన్. భారత జట్టులో చోటు కోసం ఏళ్ల కొద్దీ ఎదురు చూస్తున్న ఆటగాళ్లలో అతడు ఒకడు. అలాంటోడు దులీప్ ట్రోఫీలో రాణించి మరోసారి సెలెక్టర్లకు హెచ్చరికలు పంపించాడు. ఇండియా-బీకి కెప్టెన్​గా వ్యవహరించిన ఈ బెంగాల్ బ్యాటర్.. ఈ టోర్నీలో రెండు సెంచరీలు బాదాడు. 77.25 యావరేజ్​తో 309 రన్స్ చేశాడు. బెస్ట్ స్కోరు 157 నాటౌట్​.

శషాంక్ రావత్

బరోడాకు చెందిన శషాంక్ రావత్ కూడా దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఇండియా-ఏ తరఫున ఆడిన ఈ యంగ్ బ్యాటర్.. మ్యాచ్ విన్నింగ్ సెంచరీ బాది అందరి ఫోకస్ తన వైపు తిప్పుకున్నాడు. రెండు మ్యాచుల్లో కలిపి 256 పరుగులు చేసి తన క్లాస్ ప్రూవ్ చేశాడు.

అన్షుల్ కాంబోజ్

దులీప్ ట్రోఫీలో కొందరు బౌలర్లు మ్యాజిక్ చేశారు. స్టన్నింగ్ బౌలింగ్​తో అందర్నీ సర్​ప్రైజ్ చేశారు. ఆ లిస్ట్​లో మొదటి పేరు అన్షుల్ కాంబోజ్​దే. ఇండియా-సీకి ఆడిన ఈ ఆల్​రౌండర్.. టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్​గా నిలిచాడు. 16 వికెట్లతో దుమ్మురేపాడు. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, రికీ భుయ్ లాంటి బ్యాటర్లను బోల్తా కొట్టించాడీ పేసర్. పైన చెప్పిన ఆటగాళ్లంతా ఫామ్, ఫిట్​నెస్​, టాలెంట్ నిరూపించుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ల టాలెంట్​ను బీసీసీఐ ఎలా వాడుకుంటుందో చూడాలి.