iDreamPost
android-app
ios-app

IPL 2025: ఆర్టీఎంపై తేల్చేసిన BCCI.. కొత్త రిటెన్షన్ రూల్స్ ఇవే!

  • Published Sep 25, 2024 | 9:48 PM Updated Updated Sep 26, 2024 | 6:34 PM

No RTM Card For IPL 2025: ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా టైమ్ ఉన్నా దానికి సంబంధించి బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీఎం, ప్లేయర్ల రిటెన్షన్​పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

No RTM Card For IPL 2025: ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా టైమ్ ఉన్నా దానికి సంబంధించి బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీఎం, ప్లేయర్ల రిటెన్షన్​పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Published Sep 25, 2024 | 9:48 PMUpdated Sep 26, 2024 | 6:34 PM
IPL 2025: ఆర్టీఎంపై తేల్చేసిన BCCI.. కొత్త రిటెన్షన్ రూల్స్ ఇవే!

ఐపీఎల్ గురించి ఎప్పుడూ ఏదో ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఎక్కువగా మాత్రం సీజన్ ఆరంభానికి ముందు బాగా చర్చలు నడుస్తాయి. అలాగే వేలం సమయంలోనూ డిస్కషన్స్ ఊపందుకుంటాయి. అయితే ఈసారి మెగా ఆక్షన్ ఉండటంతో చాలా ముందు నుంచే క్యాష్ రిచ్ లీగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టీఎం, ప్లేయర్ల రిటెన్షన్​పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ విషయాలపై ఆల్రెడీ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మీటింగ్ పెట్టి డిస్కస్ చేసింది బోర్డు. వాళ్ల సలహాలు, సూచనలు తీసుకుంది. కానీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. అయితే ఎట్టకేలకు ఆర్టీఎంపై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త రిటెన్షన్ రూల్స్ కూడా ఖరారు చేసిందని వినిపిస్తోంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన బోర్డు 93వ ఏజీఎంలో రిటెన్షన్ పాలసీని ఖరారు చేసిందని సమాచారం. అయితే ఫ్రాంచైజీలు కావాలని పట్టుబట్టిన ఆర్టీఎం కార్డును బోర్డు సున్నితంగా తిరస్కరిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్త రిటెన్షన్ పాలసీలో ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. లాస్ట్ ఆక్షన్​లో మాదిరిగానే ఈసారి కూడా ఆర్టీఎం కార్డ్స్​కు ఛాన్స్ లేదని సమాచారం. కాగా, రైట్ టు మ్యాచ్ కార్డ్​ను తొలుత ఐపీఎల్-2014లో ప్రవేశపెట్టారు. ఐపీఎల్-2018 మెగా ఆక్షన్​లో ఈ రూల్​ను చివరిసారిగా వినియోగించారు. ఆ తర్వాత నుంచి దీన్ని పక్కనబెట్టారు.

ఆర్టీఎం కార్డ్స్​ను ఎలాగైనా ఈసారి ఆక్షన్​లో పెట్టాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ సీజన్ నుంచి దీన్ని కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశాయి. కానీ బోర్డు మాత్రం ఈ డిమాండ్​ను లెక్క చేయలేదని తెలుస్తోంది. ఆర్టీఎం కార్డ్స్​కు బీసీసీఐ నో చెప్పిందని సమాచారం. అయితే ఆర్టీఎం కార్డ్స్​తో పాటు రిటెన్షన్స్​పై బోర్డు నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. బీసీసీఐ అఫీషియల్​గా కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఈ విషయంలో ఏదీ చెప్పలేం. మొత్తానికి క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్​కు ముందే పలు విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ఇంక వేలం దగ్గరపడితే అందరి అటెన్షన్ దాని మీదే నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఆర్టీఎం, రిటెన్షన్స్​ విషయంలో బోర్డు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.