iDreamPost
android-app
ios-app

డొమెస్టిక్ క్రికెట్​ను శాసిస్తున్న తెలుగోడు.. అయినా టీమిండియాలోకి నో ఛాన్స్!

  • Published Sep 24, 2024 | 7:33 PM Updated Updated Sep 25, 2024 | 8:47 PM

Ricky Bhui, BCCI, Team India: డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపుతున్నాడో తెలుగోడు. ఆ టోర్నీ, ఈ టోర్నీ అనే తేడాల్లేకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అయినా అతడికి భారత క్రికెట్ బోర్డు మొండిచెయ్యి చూపిస్తోంది.

Ricky Bhui, BCCI, Team India: డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపుతున్నాడో తెలుగోడు. ఆ టోర్నీ, ఈ టోర్నీ అనే తేడాల్లేకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అయినా అతడికి భారత క్రికెట్ బోర్డు మొండిచెయ్యి చూపిస్తోంది.

  • Published Sep 24, 2024 | 7:33 PMUpdated Sep 25, 2024 | 8:47 PM
డొమెస్టిక్ క్రికెట్​ను శాసిస్తున్న తెలుగోడు.. అయినా టీమిండియాలోకి నో ఛాన్స్!

భారత క్రికెట్​లో ఎప్పుడూ నార్త్ బోర్డ్స్​దే హవా నడుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు టీమ్ సెలెక్షనే పెద్ద ఎగ్జాంపుల్​గా ఎక్స్​పర్ట్స్ చెబుతుంటారు. సౌతిండియా నుంచి తక్కువ మంది ప్లేయర్లను తీసుకోవడం ఉదాహరణగా చూపిస్తుంటారు. అయితే సౌత్​లో తమిళనాడు, కర్ణాటక నుంచి టీమిండియాకు వెళ్లే ఆటగాళ్ల సంఖ్య బాగానే ఉంది. కానీ మెన్ ఇన్ బ్లూలో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. అలాగని మన దగ్గర టాలెంటెడ్ ప్లేయర్లు లేరని కాదు. ఛాన్స్ ఇస్తే చెలరేగి ఆడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ అవకాశాలు దక్కడం లేదు. ఇలా ఎంకరేజ్​మెంట్​ లేక భారత జట్టు గడప తొక్కలేకపోతున్న ప్రతిభావంతుల్లో ఒకడు రికీ భుయ్. డొమెస్టిక్ క్రికెట్​ను శాసిస్తున్న ఈ తెలుగోడు.. టీమిండియాలోకి మాత్రం రాలేకపోతున్నాడు.

తెలుగు స్టేట్స్ నుంచి ఎందరో అత్యుత్తమ బ్యాటర్లు వచ్చారు. ఆ కోవలోకి రికీ భుయ్ వస్తాడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డొమెస్టిక్ క్రికెట్​లో అతడి రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. గతేడాది రంజీ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్​గా నిలిచాడు రికీ. 8 మ్యాచుల్లో కలిపి 902 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఛటేశ్వర్ పుజారా లాంటి దిగ్గజ బ్యాటర్లను దాటేసి హయ్యెస్ట్ రన్ స్కోరర్​గా నిలిచాడు రికీ. రంజీ ట్రోఫీలోనే కాదు.. రీసెంట్​గా ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ అతడే లీడింగ్ స్కోరర్​గా ఉన్నాడు. ఇండియా-డీ తరఫున బరిలోకి దిగిన ఈ ఆంధ్ర బ్యాటర్.. ఆరు ఇన్నింగ్స్​ల్లో కలిపి 359 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక ఫిఫ్టీ కూడా ఉంది. ఇంత బాగా ఆడినా అతడ్ని బంగ్లాదేశ్​ సిరీస్​కు సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

డొమెస్టిక్ క్రికెట్​లో ఓ రేంజ్​లో ఆడుతున్న రికీ భుయ్ గురించి తెలుగు స్టేట్స్​లోనే చాలా మందికి తెలియదు. ఎందుకంటే అతడు ఐపీఎల్ స్టార్ కాదు. రంజీ ట్రోఫీలో ఆరేళ్లుగా ఆంధ్ర క్రికెట్​కు లీడింగ్ రన్ స్కోరర్​గా ఉన్నాడు రికీ. కానీ అతడి గురించి తెలిసిన లోకల్ ఫ్యాన్స్ తక్కువే. ఫస్ట్ క్లాస్ యావరేజ్ 50కి దగ్గరలో ఉంది. అయినా ఇటు అభిమానుల నుంచి అటు భారత క్రికెట్ పెద్దల నుంచి గానీ తగిన సపోర్ట్ లభించడం లేదు. ఇంత టాలెంటెడ్ ప్లేయర్ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో ఉండి ఉంటే ఈపాటికి టీమిండియాకు ఆడేసేవాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. దేశవాళీల్లో రాణిస్తున్నా, ప్రతిష్టాత్మక టోర్నీల్లో దుమ్మురేపుతున్నా అతడ్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవం దారుణమని చెబుతున్నారు. కళ్ల ముందే వజ్రం కనిపిస్తున్నా పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

27 ఏళ్ల రికీ భుయ్​కు ఇంకా ఫ్యూచర్ ఉంది. అతడ్ని గనుక టీమిండియాలోకి తీసుకుంటే కనీసం 7 నుంచి 10 ఏళ్ల లాంగ్ కెరీర్ ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇంత కాన్ఫిడెంట్​గా చెప్పడానికి దులీప్, రంజీ ట్రోఫీలతో పాటు మొత్తం డొమెస్టిక్ క్రికెట్​లో అతడు ఆడుతున్న తీరే కారణంగా చెప్పొచ్చు. ఇప్పటిదాకా 74 ఫస్ట్​క్లాస్ మ్యాచుల్లో కలిపి 5169 రన్స్ చేశాడు రికీ. ఇందులో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడ్ని సరిగ్గా సానబెడితే పుజారా రేంజ్​లో సక్సెస్ అవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్, స్ట్రైక్ రొటేషన్​తో పాటు లాంగ్ యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడే సామర్థ్యం అతడికి బిగ్ ప్లస్ అని అంటున్నారు. మరి.. రికీ భుయ్​కు జరుగుతున్న అన్యాయం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.