iDreamPost
android-app
ios-app

శ్రేయస్ అయ్యర్​కు మరో షాక్.. ఇక ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే!

  • Published Sep 17, 2024 | 9:37 PM Updated Updated Sep 17, 2024 | 9:37 PM

BCCI Shuts Doors For Shreyas Iyer: స్టైలిష్ బ్యాటింగ్​తో తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్​గా ఎదిగాడు శ్రేయస్ అయ్యర్. అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతూ ఫ్యూచర్ స్టార్​గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం అతడి సిచ్యువేషన్ ఏమాత్రం బాగోలేదు.

BCCI Shuts Doors For Shreyas Iyer: స్టైలిష్ బ్యాటింగ్​తో తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్​గా ఎదిగాడు శ్రేయస్ అయ్యర్. అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతూ ఫ్యూచర్ స్టార్​గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం అతడి సిచ్యువేషన్ ఏమాత్రం బాగోలేదు.

  • Published Sep 17, 2024 | 9:37 PMUpdated Sep 17, 2024 | 9:37 PM
శ్రేయస్ అయ్యర్​కు మరో షాక్.. ఇక ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే!

స్టైలిష్ బ్యాటింగ్​తో తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్​గా ఎదిగాడు శ్రేయస్ అయ్యర్. అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతూ ఫ్యూచర్ స్టార్​గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తుండటంతో జట్టు భవిష్యత్ కెప్టెన్​గానూ అతడి పేరు గట్టిగా వినిపించింది. అయితే గాయం సాకు చూపి డొమెస్టిక్ క్రికెట్​లో ఆడేందుకు నిరాకరించడంతో అతడ్ని సెంట్రల్ కాంట్రాక్ట్​ నుంచి బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మొదలైన అయ్యర్ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మధ్యలో ఐపీఎల్-2024 ట్రోఫీ గెలుపు, శ్రీలంక టూర్​కు సెలెక్ట్ అవడంతో సంబురాల్లో మునిగినా.. ఇప్పుడు అయ్యర్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అతడి సిచ్యువేషన్ ఏమాత్రం బాగోలేదు. ఈ టైమ్​లో అతడికి బోర్డు గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయ్యర్​కు టీమిండియా ద్వారాలు మూసుకుపోయాయని వినిపిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ టీమ్ సెలెక్షన్​కు అతడ్ని బీసీసీఐ కంప్లీట్​గా పక్కన పెట్టేసిందని సమాచారం. లాంగ్ ఫార్మాట్​లో జట్టులో చోటే లక్ష్యంగా డొమెస్టిక్ రెడ్​బాల్ టోర్నీల్లో దిగాడు అయ్యర్. బుచ్చిబాబు టోర్నీ సహా ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలోనూ ఆడాడు. కానీ ఆడిన ప్రతి చోటా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నమెంట్​లో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్.. అక్కడ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. అయినా సీనియర్ ప్లేయర్ అనే గౌరవంతో దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జట్టుకు కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ. కానీ బోర్డు నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీ ఫస్ట్ రౌండ్​లో 9, 54 పరుగులు చేశాడు మిడిలార్డర్ బ్యాటర్. దీంతో బంగ్లాదేశ్​తో జరిగే తొలి టెస్ట్​కు అతడ్ని పక్కనబెట్టారు సెలెక్టర్లు.

సెకండ్ రౌండ్​లో అయినా కసిగా ఆడి టెస్ట్ టీమ్​లోకి కమ్​బ్యాక్ ఇస్తాడని అనుకుంటే మళ్లీ ఫెయిలయ్యాడు అయ్యర్. రెండో మ్యాచ్​లో ఒక ఇన్నింగ్స్​లో డకౌట్ అయిన స్టార్ బ్యాటర్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 41 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ టీమిండియాలోకి రావాలంటే భారీ సెంచరీలు బాదితే తప్ప తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. బంగ్లాతో జరిగే ఆఖరి టెస్ట్​కు కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకునే ఛాన్సులు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఓ బీసీసీఐ అధికారి నేషనల్ మీడియా మాట్లాడుతూ అయ్యర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టెస్ట్ టీమ్​లో ఇప్పుడు అయ్యర్​కు చోటు లేదని, ఎవర్ని తీసేసి అతడ్ని రీప్లేస్ చేస్తారో చెప్పాలంటూ ఆ ఆఫీసర్ ఎదురు ప్రశ్నించాడని తెలుస్తోంది.

‘అయ్యర్ షాట్ సెలెక్షన్ చెత్తగా ఉంది. దులీప్ ట్రోఫీలో అతడు షాట్లు ఆడుతున్న తీరు బాగోలేదు. క్రీజులో సెటిల్ అయ్యాక కూడా అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మంచి అవకాశాన్ని కోల్పోయాడు’ అని బీసీసీఐ అధికారి చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే అయ్యర్ టెస్ట్ కమ్​బ్యాక్ ఇప్పట్లో సాధ్యం కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడు ఇలాగే ఆడితే డొమెస్టిక్ కెరీర్ మీద కూడా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. షాట్ సెలెక్షన్ మార్చుకోకపోతే అతడికి ఇతర ఫార్మాట్లలోనూ టీమిండియాలో చోటు కష్టమేనని.. ఇంక ఇంటి దగ్గర కూర్చోక తప్పదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ముగిసిపోయిందేమీ లేదు.. తప్పులు తెలుసుకొని అలర్ట్ అయితే కెరీర్​ను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.