iDreamPost
android-app
ios-app

Virat Kohli: బంగ్లాతో సిరీస్‌కి ముందు ఊహించని షాకిచ్చిన గంభీర్‌-కోహ్లీ!

  • Published Sep 18, 2024 | 11:31 AM Updated Updated Sep 18, 2024 | 11:31 AM

Virat Kohli, Gautam Gambhir: బంగ్లాదేశ్ తో స్టార్ట్ అవ్వబోయే టెస్ట్ సిరీస్ కు ముందు ఫ్యాన్స్ కు ఊహించని షాకిచ్చారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Virat Kohli, Gautam Gambhir: బంగ్లాదేశ్ తో స్టార్ట్ అవ్వబోయే టెస్ట్ సిరీస్ కు ముందు ఫ్యాన్స్ కు ఊహించని షాకిచ్చారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Sep 18, 2024 | 11:31 AMUpdated Sep 18, 2024 | 11:31 AM
Virat Kohli: బంగ్లాతో సిరీస్‌కి ముందు ఊహించని షాకిచ్చిన గంభీర్‌-కోహ్లీ!

బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం భారత జట్టు పూర్తిగా సన్నద్ధం అయ్యింది. బంగ్లాను ఢీ కొట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. స్పిన్ తో పాటుగా పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి భరతం పట్టాలని భావిస్తోంది. అందుకోసం గ్రౌండ్ లో చమటోడుస్తున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఊహించని షాకిచ్చారు. బహుశా ఇది క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు బీసీసీఐ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఇక అందుకు సంబంధించిన ప్రోమోను లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. ఇక ఈ ప్రోమోలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీకి చెందిన కొన్ని స్పెషల్ ఇన్నింగ్స్ ల గురించి గుర్తు చేసుకున్నాడు. అలాగే ఇద్దరి మధ్య కొన్ని పంచులు కూడా పేలాయి. దాంతో పాటుగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ కావడంతో.. ఫుల్ ఎపిసోడ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో గంభీర్ రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి సంబంధించిన కొన్ని అద్బుతమైన ఇన్నింగ్స్ ల గురించి గుర్తు చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ లో పారించిన పరుగుల వరద గురించి చెప్పుకొచ్చాడు. “నాకింకా గుర్తుంది నువ్వు ఆస్ట్రేలియా సిరీస్ లో పరుగుల వరద పారించి.. ఆ జోన్ లోకి వెళ్లిపోయావు అనుకున్నాను. అలాగే నేను కూడా న్యూజిలాండ్ తో నేపియర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో నీలాంటిదే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాను. ఆ తర్వాత పరుగులు సాధించే జోన్ లోకి నేను వెళ్లలేదు. రన్స్ చేస్తున్నప్పుడు ఆ జోన్ లో ఉండే సంతోషం ఏలా ఉంటుందో నేను ఊహించగలను” అని చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్.

ఇక ఈ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య కొన్ని సరదా సంభాషణలు కూడా జరిగాయి.” మీరు బ్యాటింగ్ లేదా గ్రౌండ్ లో ఉన్నప్పుడు ప్రత్యర్థులతో గొడవ పడితే.. అది మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేస్తుందా? లేదా ఇంకా మోటివేట్ చేస్తుందా?” అని గంభీర్ ను ప్రశ్నించాడు విరాట్ కోహ్లీ. దానికి గంభీర్ నవ్వుతూ.. “నా కంటే ఎక్కువ నువ్వే గొడవ పడుతూ ఉంటావ్ కదా.. నీకే తెలియాలి” అని ఆన్సర్ ఇవ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి. అయితే ఈ పద్ధతి నేను తప్పు అని అనడం లేదు. ఇదే కరెక్ట్ అనే వారి కోసం ఎదురుచూస్తున్నాను అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. దాంతో ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడొస్తుందా? అని క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా.. కోహ్లీకి గంభీర్ కు గతంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వీరిద్దరు మాట్లాడుకోట్లదని అభిమానులు అనుకుంటున్నారు. ఈ విషయంపై గతంలోనే ఇద్దరు కలిసి క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఇలాంటి ప్రత్యేక ఇంటర్వ్యూ రావడం అనేది నిజంగా ఫ్యాన్స్ కు షాకనే చెప్పాలి. కోహ్లీ-గంభీర్ ఇంటర్వ్యూను ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. మరి ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom