Champions Trophy 2025: పాకిస్తాన్ కు వచ్చి ఆడండి.. మీ భద్రతకు నాది భరోసా: పాక్ మాజీ పేసర్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వచ్చి ఆడాలని, మీ భద్రతకు నాది భరోసా అంటూ ఓ పాకిస్తాన్ మాజీ తన్వీర్ అహ్మద్ కామెంట్స్ చేశాడు. హర్భజన్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ కామెంట్స్ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వచ్చి ఆడాలని, మీ భద్రతకు నాది భరోసా అంటూ ఓ పాకిస్తాన్ మాజీ తన్వీర్ అహ్మద్ కామెంట్స్ చేశాడు. హర్భజన్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ కామెంట్స్ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే ఉంది. దానికి కారణం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగబోతోంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత జట్టు పాక్ లో పాల్గొనదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అయితే పాక్ ఆటగాళ్లు, మాజీలు కచ్చితంగా పాకిస్తాన్ రావాల్సిందే.. వచ్చి ఆడాల్సిందే అని పట్టుబడుతున్నారు. తాజాగా మరో మాజీ ప్లేయర్ టీమిండియా ఆటగాళ్లు పాక్ వచ్చి ఆడాలని, మీ భద్రతకు నాది భరోసా అంటూ కామెంట్స్ చేశాడు.

పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా పాల్గొంటుందా? లేదా? అన్నది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. భారత జట్టును పాక్ కు పంపించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించడం లేదు. అయితే కొంత మంది పాక్ ఆటగాళ్లు ఇండియా పాకిస్తాన్ కు రావాల్సిందే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పాకిస్తాన్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ ఈ విషయంపై మాట్లాడాడు. “మేము సింహాలము. మీ దేశం వచ్చి మేము క్రికెట్ ఆడాము. అలాగే మీరు కూడా మా దేశం వచ్చి ఆడండి. మీ భద్రతకు నాది భరోసా. భారత్ లో పాక్ ఎలా ఆడింది అనేది ముఖ్యం కాదు. పాక్ ఎప్పుడూ కూడా భారత్ లో ఆడటానికి నిరాకరించలేదు” అంటూ హర్భజన్ సింగ్ కు కౌంటర్ గా చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. 2008 ఆసియా కప్ తర్వాత టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లలేదు. మరి ఇప్పుడు త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ కు టీమిండియా వెళ్తుందో, లేదో చూడాలి. ఇక ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే ఐసీసీతో చర్చించనుంది. ఒకవేళ భారత్ అక్కడికి వెళ్లకపోతే.. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఈ పద్ధతిలో భాగంగా భారత్ ఆడే అన్ని మ్యాచ్ లు శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా జరుగుతాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments