iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: సిరీస్ గెలిచినా.. టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చిన గంభీర్! ఎందుకంటే?

  • Published Jul 31, 2024 | 4:44 PM Updated Updated Jul 31, 2024 | 4:44 PM

శ్రీలంకపై సిరీస్ గెలిచినప్పటికీ.. డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

శ్రీలంకపై సిరీస్ గెలిచినప్పటికీ.. డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Gautam Gambhir: సిరీస్ గెలిచినా.. టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చిన గంభీర్! ఎందుకంటే?

గౌతమ్ గంభీర్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత తన తొలి సిరీస్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుని తన మార్క్ చూపించాడు. పగ్గాలు చేపట్టినప్పటి నుంచే తన మార్క్ నిర్ణయాలతో వార్తల్లో నిలిచాడు. హార్దిక్ ను కాదని సూర్యకుమార్ కు టీ20 కెప్టెన్సీని అప్పగించడం లాంటి షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఇక శ్రీలంకపై సిరీస్ గెలిచినప్పటికీ.. డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు గంభీర్. మరి సిరీస్ గెలిచినా.. ప్లేయర్లకు గంభీర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆటగాళ్లు అందరూ సమష్టిగా రాణించారు. ఇక ఈ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు కోచ్ గౌతమ్ గంభీర్. పొట్టి సిరీస్ లో ఆటగాళ్ల ప్రదర్శనపై సంతృప్తిని వ్యక్త పరిచాడు. ఈ క్రమంలో వన్డే సిరీస్ కు ఎంపిక కాని కొందరు ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. “శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక కాని ప్లేయర్లకు సుదీర్ఘ విరామం దొరుకుతుంది. ఈ సమయంలో మీరు ఫిట్ నెస్, ఆటను మెరుగుపర్చుకోండి. అలా మీరు బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సిరీస్ కు సిద్ధంకండి. అయితే సిరీస్ కు ముందు ఫిట్ నెస్ సాధిస్తామంటే కుదరదు. ఆ సమయానికే మీరు పూర్తిగా రెడీ అయ్యి ఉండాలి” అంటూ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు.

కాగా.. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్లు ఎంపిక కాలేదు. వీరిని ఉద్దేశించే గౌతమ్ గంభీర్ ఈ కామెంట్స్ చేశాడని అర్దమవుతోంది. ఇక లంకతో ఆగస్ట్ 2 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.  ఆ తర్వాత సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు, అక్టోబరు లో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. దీని కోసమే వాళ్లను సిద్ధంగా ఉండాలని గంభీర్ సూచించాడు. మరి టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.