iDreamPost
android-app
ios-app

అమ్మాయిగా మారిపోయిన Team India క్రికెటర్ కొడుకు.. అసలేం జరిగిందంటే?

  • Published Nov 11, 2024 | 2:43 PM Updated Updated Nov 11, 2024 | 2:43 PM

Aryan Bangar: టీం ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కొడుకు ఆర్యన్ బంగర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Aryan Bangar: టీం ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కొడుకు ఆర్యన్ బంగర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అమ్మాయిగా మారిపోయిన Team India క్రికెటర్ కొడుకు.. అసలేం జరిగిందంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు. అతను కొడుకు కాదు కూతురు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఓ రేంజిలో సంచలనం సృష్టిస్తున్నాయి. అదేంటి అబ్బాయి అమ్మాయిగా మారడం ఏంటి? అసలు ఈ వార్తలు ఏంటి? ఇంతకీ అసలు ఏమైంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సంజయ్ బంగర్ పెద్ద కుమారుడు ఆర్యన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం నెటిజన్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ని ఇస్తుంది. ఆర్యన్ హార్మోన్ల మార్పుకు గురయ్యాడు. అందుకే ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినట్లు తెలిపాడు. అలాగే ఇక నుంచి తన పేరు ఆర్యన్ కాదు అనయ అంటూ చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్యన్ లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఆర్యన్ అలియాస్ అనయ గత 10 నెలల నుంచి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటోందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాని తగలబెడుతుంది. నెటిజెన్స్ కి సెగలు రేపుతోంది. 10 నెలల సర్జరీ తర్వాత ఇప్పుడు అమ్మాయిగా రూపాంతరం చెందానని అనయ కామెంట్స్ చేసింది. అలాగే ఈ నిర్ణయం కోసం తన క్రికెట్ కెరీర్‌నే త్యాగం చేశానని కామెంట్స్ చేసింది. ఆర్యన్ బంగర్ కూడా తన తండ్రి సంజయ్ బంగర్ లాగే క్రికెటర్ కావాలని అనుకున్నాడు. టీం ఇండియా తరపున ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. స్టార్ క్రికెటర్ గా తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని ఆరాట పడ్డాడు. క్రికెటర్ కావడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాడు. అందుకు తగ్గట్టుగానే చిన్నతనం నుంచే క్రికెట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రాక్టీస్ లో బాగానే రాణించాడు. తక్కువ కాలంలోనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్యన్. లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆర్యన్ ఆడాడు.

అయితే విధి అతని తల రాతను మార్చింది. హార్మోన్స్ ప్రభావం వల్ల ఊహించని పరిణామం జరిగింది. తన శరీరం మొత్తం మారిపోయింది. దాంతో ఆర్యన్ కి శస్త్ర చికిత్స చేశారు. దీంతో సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ కాస్త ఇప్పుడు అనయ బంగర్ గా మారిపోవడం జరిగింది. అయితే విధి తనని ఇలా మర్చినందుకు ఆర్యన్ అలియాస్ అనయ ఏమాత్రం క్రుంగి పోలేదు. తను ఈ నిర్ణయంతో కూడా చాలా సంతృప్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అనయ బంగర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఉంటుంది. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేసింది. ఆ రీల్ తెగ వైరల్ అవుతుంది. అలాగే ఆమె ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనయని చూసిన నెటిజెన్స్ అందమే అసూయ పడేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అమ్మాయిగా మారినా కూడా క్రికెటర్ గా కెరీర్ కొనసాగించవచ్చని సలహాలు ఇస్తున్నారు. ఇక అనయ రానున్న రోజుల్లో తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఇదీ సంగతి. మరి ఆర్యన్ బంగర్ హార్మోన్స్ ప్రభావం వల్ల అమ్మాయిగా మారడం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)