iDreamPost
android-app
ios-app

ఓవర్‌కు 8 బంతులతో కొత్త రూల్‌.. ఇండియా వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధం!

  • Published Oct 09, 2024 | 11:58 AM Updated Updated Oct 09, 2024 | 11:58 AM

Team India, Hong Kong Sixes, Cricket News: హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ లీగ్‌లో టీమిండియా కూడా ఆడుతుందని.. టోర్నీ నిర్వహకులు ప్రకటన చేశారు. అయితే.. ఆ టోర్నీ రూల్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India, Hong Kong Sixes, Cricket News: హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ లీగ్‌లో టీమిండియా కూడా ఆడుతుందని.. టోర్నీ నిర్వహకులు ప్రకటన చేశారు. అయితే.. ఆ టోర్నీ రూల్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 09, 2024 | 11:58 AMUpdated Oct 09, 2024 | 11:58 AM
ఓవర్‌కు 8 బంతులతో కొత్త రూల్‌.. ఇండియా వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధం!

ఇంటర్నేషనల్‌ లెవెల్‌లో.. టెస్ట్‌ మ్యాచ్‌, వన్డే మ్యాచ్‌, టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.. టీ10 పేరుతో ఇన్నింగ్స్‌కు 10 ఓవర్లతో కూడా కొన్ని చోట్లా ఫ్రాంచైజ్‌ లీగులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ మించి మరో లీగ్‌ రాబోతుంది. అదే.. హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ టోర్నీ. హాంగ్‌కాంగ్‌ వేదికగా జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 దేశాలు పాల్గొనబోతున్నాయి. అందులో టీమిండియా కూడా ఉందని.. తాజాగా టోర్నీ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ టోర్నీలో ఎప్పుడో 1992లోనే ప్రారంభమైంది. 2017 వరకు కొనసాగి.. ఆ తర్వాత ఆగిపోయింది. మళ్లీ తిరిగి ఈ ఏడాది ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు టోర్నీ నిర్వహకులు. అయితే.. ఈ టోర్నీలో చాలా చిత్రవిచిత్రమైన రూల్స్‌ ఉంటాయి. కొన్ని అయితే.. మన గల్లీ క్రికెట్‌ రూల్స్‌ కూడా ఉంటాయి.

గతంలో కూడా ఈ టోర్నీలో టీమిండియా ఆడింది. సచిన్‌ టెండూల్కర్‌, అజయ్‌ జడేజా, ధోని లాంటి స్టార్‌ క్రికెటర్లు ఈ టోర్నీలో టీమిండియా తరఫున ఆడారు. మరో విశేషం ఏంటంటే.. ఈ టోర్నీలో ఇండియాతో పాటు పాకిస్థాన్‌ కూడా పాల్గొననుంది. దీంతో.. ఈ టోర్నీలో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూసే అవకాశం క్రికెట్‌ అభిమానులకు కలగనుంది. భారత్‌, పాక్‌తో పాటు అయితే.. ఇక్కడ మనం ఈ టోర్నీ రూల్స్‌తో పాటు.. అలాగే టీమిండియా తరఫున ఎవరు ఈ టోర్నీలో పాల్గొంటారనే విషయాల గురించి తెలుసుకుందాం.. ఈ హాంగ్‌కాంగ్‌ టోర్నీలో మొత్తం 12 టీమ్స్‌ పాల్గొంటాయి. ఒక్కో టీమ్‌కు కేవలం ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారు. అదేంటి.. క్రికెట్‌ టీమ్‌లో 11 మంది కదా అని అనుకోవచ్చు.. అదే ఈ టోర్నీలో స్పెషల్‌. ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.

టీమ్‌కు ఆరుగురు ప్లేయర్లతో పాటు.. ఒక్కో ఇన్నింగ్స్‌ కేవలం 5 ఓవర్లు మాత్రమే ఉంటుంది. అందులోనూ.. ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక్కో ఓవర్‌కు 8 బంతులు వేస్తారు. సాధారణంగా అయితే ఓవర్‌కు 6 బంతులనే మనకు తెలుసు.. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్‌ టోర్నీలో ఓవర్‌కు 5 బంతులు పెట్టారు. ఈ హాంగ్‌కాంగ్‌ టోర్నీలోని ఫైనల్‌ మ్యాచ్‌కు ఓవర్‌కు ఏకంగా 8 బంతులు పెట్టారు. మరో అదిరిపోయే ట్వీస్ట్‌ ఏంటంటే.. ఓ బ్యాటర్‌ 31 పరుగులు చేస్తే.. అతను రిటైర్‌ అయిపోవాలి. ఒక వేళ మిగిలిన బ్యాటర్లంతా అవుటైతే, లేదా రిటైర్‌ అయితే.. మళ్లీ బ్యాటింగ్‌కి దిగే ఛాన్స్‌ ఉంటుంది. అలాగే ఐదో వికెట్‌ పడిన తర్వాత.. ఆలౌట్‌ అయినట్లు కాదు. చివరి బ్యాటర్‌ ఒక్కడే సింగిల్‌ బ్యాటింగ్‌ చేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ గల్లీ క్రికెట్‌ రూల్‌. అయితే.. ఐదో వికెట్‌గా అవుటైన బ్యాటర్‌ను రన్నర్‌గా పెట్టి.. చివరి బ్యాటర్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తాడు. మొత్తం ఆరు వికెట్లు పడితేనే ఆలౌట్‌ అయినట్లు లెక్క. ఇలా ఈ టోర్నీలో చిత్రవిచిత్రమైన రూల్స్‌ ఉన్నాయి.

గతంలో సచిన్‌ ఈ టోర్నీలో ఆడి కేవలం 11 బంతుల్లోనే 32 రన్స్‌ చేసి రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు. 2005లో టీమిండియానే టోర్నీలో ఛాంపియన్‌గా కూడా నిలవడం విశేషం. మరి ఈ టోర్నీలో టీమిండియా తరఫున ఏ ఆరుగురు ప్లేయర్లు పాల్గొంటారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఈ టోర్నీలో నవంబర్‌ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారు. అయితే.. ఇప్పుడు టీ20 క్రికెట్‌ ఆడుతున్న ప్లేయర్లు సూర్య కుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌, రిషభ్‌ పంత్‌ లాంటి యంగ్‌ క్రికెటర్లును పంపుతారా? లేక రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను కూడా ఈ టోర్నీకి పంపుతారా? అనే చూడాలి. రోహిత్‌, కోహ్లీ ఇంటర్నేషనల్‌ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హాంగ్‌కాంగ్‌ టోర్నీలో టీ20 క్రికెట్‌ కాదు.. సో.. రోహిత్‌, కోహ్లీలను పంపేందుకు అబ్జెక్షన్‌ కూడా ఏం ఉండదు. పైగా వీళ్లిద్దరూ ఆడితే.. ఆ టోర్నీకే ప్లస్‌ అవుతుంది. మరి చూడాలి.. టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ 6తో ఈ టోర్నీ బరిలోకి దిగుతుందో? మరి ఈ టోర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.