iDreamPost
android-app
ios-app

నానమ్మ జ్ఞాపకార్ధం బిచ్చగాడు 20 వేల మందికి విందు.. ఏకంగా రూ. 1.25 కోట్లతో

  • Published Nov 19, 2024 | 11:36 AM Updated Updated Nov 19, 2024 | 11:36 AM

Pakistan Beggar: బిచ్చగాళ్లు అంటే మామూలుగా తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక అవస్తలు పడుతుంటారు. కానీ, ఓ బిచ్చగాడు మాత్రం ఏకంగా 1.25 కోట్లతో విందు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

Pakistan Beggar: బిచ్చగాళ్లు అంటే మామూలుగా తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక అవస్తలు పడుతుంటారు. కానీ, ఓ బిచ్చగాడు మాత్రం ఏకంగా 1.25 కోట్లతో విందు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

  • Published Nov 19, 2024 | 11:36 AMUpdated Nov 19, 2024 | 11:36 AM
నానమ్మ జ్ఞాపకార్ధం బిచ్చగాడు 20 వేల మందికి విందు.. ఏకంగా  రూ. 1.25 కోట్లతో

యాచించి పైసా పైసా కూడబెట్టి ధనవంతులైన బిచ్చగాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బస్టాండ్ లలో, రహదారి కూడళ్లలో బిచ్చమెత్తుకుని డబ్బులు పోగేసుకుంటుంటారు. ఆ డబ్బులతో ఖరీదైన స్థలాలు కొనుగోలు చేస్తుంటారు బిచ్చగాళ్లు. కోటీశ్వరులకంటే ఏం తక్కువ కాదు అన్నట్టుగా కనిపిస్తుంది వీరి వ్యవహారం. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడు తన నానమ్మ జ్ఞాపకార్ధం ఇచ్చిన విందు హాట్ టాపిక్ గా మారింది. విందు ఇవ్వడంలో పెద్ద విషయం ఏముంది అంటారా? ఆశ్చర్యపోయే విషయం అక్కడే ఉందండి. బిచ్చగాడు ఆ విందుకు చేసిన ఖర్చు తెలిస్తే నోరెల్లబెట్టడం ఖాయం. ఆ బిచ్చగాడు ఏకంగా రూ. 1.25 కోట్లతో విందు ఇచ్చాడు. 20 వేల మందికి నోరూరించే వంటకాలతో విందు ఏర్పాటు చేశాడు.

సంపన్నుల కుటుంబాల్లో మాదిరిగా బిచ్చగాడు విందు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచాడు. చుట్టూ నాలుగు ఊర్లు చెప్పుకునేలా బిచ్చగాడు ఇచ్చిన విందు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం తెలిసి కోటీశ్వరులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా బిజినెస్ టైకూన్లు, సంపన్నులు ఇలాంటి విందులను ఏర్పాటు చేస్తుంటారు. కోట్లు ఖర్చు పెట్టి విందు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇప్పటి వరకు ఓ బిచ్చగాడు కోటి రూపాయలతో విందు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ బిచ్చగాడి నానమ్మ ఇటీవలె మృతి చెందింది. ఇతడు స్థానికంగా బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే తన నానమ్మ గుర్తుగా అతడు విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె చనిపోయిన 40వ రోజున ఆ కుటుంబం భారీ విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం రూ. 1.25 కోట్లను వెచ్చించాడు బిచ్చగాడు. ఈ విందుకు బంధువులు, స్థానికులు హాజరయ్యారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి ఈ విందుకు హాజరయ్యేందుకు వేలాది మంది తరలివచ్చారు. విందులో రకరకాల వంటకాలను అతిథులకు వడ్డించారు. పాక్ సంప్రదాయ వంటకాలైన సిరి పాయా, మురబ్బాతో పాటు నాన్ వెజ్‌ ఐటెమ్స్‌తో భారీగా మెనూను సిద్ధం చేశారు.

ఇక డిన్నర్‌కు మటన్‌, నాన్‌ మటార్‌ గంజ్‌తో పాటు మరిన్ని వంటకాలను వచ్చిన అతిథులకు వడ్డించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలాలో రాహ్‌వలి రైల్వేస్టేషన్‌ సమీపంలో నిర్వహించిన ఈ విందు గురించి తెలిసిన ప్రతీ ఒక్కరు షాక్ అవుతున్నారు. బిచ్చగాడు ఏంటి.. కోట్ల రూపాయలతో విందు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. నానమ్మ కోసం బిచ్చగాడైన మనవడు ఇచ్చిన విందుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి నానమ్మ కోసం రూ. కోటి 25 లక్షలతో విందు ఏర్పాటు చేసిన బిచ్చగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet