Vinay Kola
IND vs NZ: నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. అయితే గ్రౌండ్ కి ఇంకా టీమ్స్ రాలేదు.
IND vs NZ: నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. అయితే గ్రౌండ్ కి ఇంకా టీమ్స్ రాలేదు.
Vinay Kola
గత టెస్టు, టీ20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది టీం ఇండియా. బంగ్లాదేశ్ ని క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో ఉంది. ఆ హుషారుతో ప్రస్తుతం స్వదేశంలో మరో టెస్టు ఆడేందుకు రెఢీ అవుతుంది. ఈరోజు నుంచి న్యూజిలాండ్‌తో తలపడనుంది. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ స్టార్ట్ కానుంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా నేడు ఫస్ట్ మ్యాచ్ ని ఆడనుంది. బంగ్లాపై గెలుపు తరువాత అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు బ్రేక్ వేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ కి ఆటంకం కలిగే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం కురవడంతో టాస్ లేట్ అవ్వనుంది.
నిజానికి ఎర్లీగానే మ్యాచ్ స్టార్ట్ కావలసి ఉంది. టాస్ మార్నింగ్ 9 గంటలకే పడాల్సి ఉంది. కానీ వర్షం వల్ల లేట్ అవుతుందని మ్యాచ్ రిఫరీ అనౌన్స్ చేశారు. అందువల్ల గ్రౌండ్ కి రెండు టీమ్స్ కూడా ఇంకా రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రౌండ్ లో పరిస్థితులు గురించి టీమిండియా మేనేజ్మెంట్‌తో అంపైర్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే పిచ్‌పై, గ్రౌండ్ లో కవర్లు కప్పి ఉంచారు. అయితే వర్షం తగ్గితే మ్యాచ్‌ను కంటిన్యూ చేయడం పాజిబుల్ అవుతుంది. మంచి విషయం ఏమిటంటే చిన్నస్వామి స్టేడియం మైంటెనెన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఆ స్టేడియంలో మంచి డ్రైనేజీ సిస్టమ్ ఉంది. అందువల్ల గ్రౌండ్ లో రైన్ వాటర్ ఎక్కువగా స్టోర్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో వర్షపు నీటికి గ్రౌండ్ పెద్దగా పాడయ్యే అవకాశం ఉండదు. అయినా కానీ ఫస్ట్ టెస్టు కంఫర్ట్ గా కంటిన్యూ అవ్వడం కొంచెం కష్టమే అనిపిస్తోంది.
ఎందుకంటే ఏకంగా వారం రోజుల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ లో ఫస్ట్ డే, సెకండ్ డే మాక్సిమం 80 పర్సెంట్ వర్షం కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులు వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అందువల్ల కర్ణాటకలో వాతావరణ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. దాంతో జనాలు కూడా బయటకి వచ్చే ఛాన్స్ లేదు. ఇక ప్రస్తుతం టీం ఇండియా మంచి జోష్ లో ఉంది. ప్లేయర్స్ లో కాన్ఫిడెన్స్ బలంగా ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు పెంచుకోవలంటే ఈ సిరీస్ టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఇండియా టాప్ ప్లేస్ లో ఉంది. మరోవైపు శ్రీలంక టూర్ లో భారీ ఓటమి చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్ అయినా గెలవాలని పట్టుదలతో రెఢీ అవుతుంది. చూడాలి మరి ఈ సిరీస్ లో ఏ టీం సత్తా చాటుతుంది అనేది. ఇక దీని గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.