Vinay Kola
Wruddhiman Saha: టీం ఇండియా స్టార్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు.
Wruddhiman Saha: టీం ఇండియా స్టార్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు.
Vinay Kola
భారత వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీని కొనసాగించనున్నాడు. ఈ సీజనే తన చివరి సీజన్ అని వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. వృద్ధిమాన్ సాహ మంచి స్టంపర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 40 ఏళ్ల వృద్ధిమాన్ సాహా 2010లో ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌తో ఆయన అరంగేట్రం చేశాడు. టీం ఇండియా తరపున మొత్తం 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్ తర్వాత ఇండియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన కీపర్‌లలో వృద్ధిమాన్ సాహా రెండో స్థానంలో ఉన్నాడు. సాహా తన కెరీర్‌లో టెస్టుల్లో మూడు సెంచరీలు చేశాడు. 29 సగటుతో మొత్తం 1353 పరుగులు చేశాడు. వన్డేల్లో అయితే కేవలం 41 రన్స్ మాత్రమే చేశాడు. ఇక దేశావాళిలో భారీగా పరుగులు చేసిన సాహా మొత్తం 14 సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 7 వేలకు పైగా రన్స్ చేశాడు.
సాహా తన చివరి టెస్టు ఆడి మూడేళ్ళు అవుతుంది. తన చివరి టెస్ట్ ని 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు. సాహా కొన్ని కీలకమైన నాక్‌లు ఆడినా కానీ.. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలతో కూడిన అప్పటి కొత్త టీమ్ మేనేజ్‌మెంట్, రిషబ్ పంత్ బ్యాకప్‌గా KS భరత్‌పై ఫోకస్ పెట్టింది. దాంతో వృద్ధిమాన్ సాహాని టీం నుండి తొలగించాలని డిసైడ్ అయ్యింది. సాహా ఈ నెలాఖరులో జరగనున్న ఐపిఎల్ మెగా వేలంలో కూడా తన పేరు రిజిస్టర్ చేసుకోలేదు. దాంతో వచ్చే ఏడాది అతను IPLలో ఆడే ఛాన్స్ లేదు. సాహా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. కానీ వేలానికి ముందు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తుంది. వృద్ధిమాన్ సాహా 2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత మూడేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కి ఆడుతూ ఉన్నాడు. అయినా కానీ ఈసారి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకోలేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐదు ఫ్రాంచైజీలకు కూడా ఆడాడు. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక, అప్పటి నుండి ప్రతి సీజన్‌లో పాల్గొన్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో సాహా కూడా ఒకరు కావడం విశేషం. ఎంతో కాలం పాటు ఐపీఎల్లో పలు జట్లకు ఆడిన సాహా మొత్తం 2934 పరుగులు చేశాడు. ఐపిఎల్ లో మొత్తం 170 మ్యాచ్ లు ఆడిన సాహా 1 సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో తన సొంత రాష్ట్రమైన బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వృద్ధిమాన్ సాహా తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.