గోపీచంద్- శ్రీను వైట్ల ’విశ్వం‘ మూవీ రివ్యూ

మ్యాచో స్టార్ గోపీచంద్, స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మూవీ విశ్వం. అక్టోబర్ 11న గ్రాండ్‌గా రిలీజైంది. మరీ ఈ సినిమా గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా లేదా తెలియాలంటే.. ఈ రివ్యూ చదివేయండి

మ్యాచో స్టార్ గోపీచంద్, స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మూవీ విశ్వం. అక్టోబర్ 11న గ్రాండ్‌గా రిలీజైంది. మరీ ఈ సినిమా గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా లేదా తెలియాలంటే.. ఈ రివ్యూ చదివేయండి

Viswam

11-10-2024, యాక్షన్, U/A Certificate
U/A Certificate
  • నటినటులు:గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సేన్ గుప్తా, నరేష్, ప్రగతి, వెన్నెల కిశోర్, శ్యామ్, పృధ్వీ
  • దర్శకత్వం:శ్రీను వైట్ల
  • నిర్మాత:టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, వేణు దొండెపూడి
  • సంగీతం:చైతన్య భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ:కెవి గుహన్

Rating

2.25

మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆచి తూచి కథలు ఎంపిక చేసినప్పటికీ బాక్సాఫీసును షేక్ చేసే సినిమాలు రావట్లేదు. అలాగే హిట్టు మొహం మర్చిపోయాడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ యాక్షన్ చూపడంలో తడబడుతున్నాడు. మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ అనే రీ సౌండ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఎమర్జెన్సీగా ఈ ఇద్దరికి హిట్టు అవసరం. ఈ క్రేజీ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన చిత్రమే విశ్వం. అక్టోబర్ 11న గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ గోపీచంద్ అభిమానులను ఆకట్టుకుందా.. శ్రీను వైట్ల.. తన కామెడీని పండించాడా తెలియాలంటే మూవీ రివ్యూలోకి వెళదాం.

కథ
ఓ టెర్రరిస్ట్ ఇండియాలో కొంత మందితో బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయం మినిస్టర్‌కు తెలుస్తుంది. అతడ్ని చంపేస్తుండగా ఓ పాప చూస్తుంది. ఆ పాపను కాపాడేందుకు సమైరా (కావ్య థాపర్) ఇంట్లోకి ప్రవేశిస్తాడు గోపీ ( గోపీచంద్). ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పాపను కాపాడుతుంటాడు. పాప కోసం ఇంత చేస్తున్నావేంటీ అంటూ ప్రశ్నిస్తారు సమైరా, ఆమె కుటుంబ సభ్యులు. అసలు గోపీ విదేశాల నుండి ఎందుకు వచ్చాడు..? సమైరాతో పరిచయం, ప్రేమ ఎలా అయ్యింది.. ఆ పాపను కాపాడేందుకు వచ్చిన విశ్వం (గోపీచంద్) ఎవరు..? అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ? శర్మగా ఇండియాలో సెటిలైన ఖురేషీ ఎవరు..? చివరకు పాపను కాపాడాడా లేదా అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

శ్రీను వైట్ల సినిమా అనగానే యాక్షన్ అండ్ కామెడీ గుర్తుకు రావాల్సిందే. మధ్యలో లవ్ ట్రాక్ పేర్లర్‌లా నడిపిస్తుంటాడు. కానీ గత కొన్ని సినిమాల నుండి అతడి ట్రాక్ తప్పింది. దీంతో అతడి ట్రాక్ రికార్డు పడిపోయింది. రోటిన్‌కు భిన్నంగా కొత్త కథలతో యంగ్ హీరోలు దూసుకు వస్తుంటే.. ఇంకా పాత చింతకాయ పచ్చడి కథలు చెబుతుంటే ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. విశ్వం కూడా ఇదే వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. కామెడీ ఓకే కానీ.. కొత్త జాడీలో పాత పచ్చడి వేసినట్లు ఉంది. చాలా రోజుల తర్వాత తనకు అచ్చొచ్చిన ట్రైన్ ట్రాక్ కామెడీ కనిపిస్తుంది. నరేష్, ప్రగతి వెన్నెల కిశోర్ మధ్య ఫన్నీ ఇన్సిడెంట్స్ కాస్తంత వెంకీని గుర్తుకు తెస్తుంటాయి. పృధ్వీతో కూడా చాలా రోజుల తర్వాత చేయించిన కామెడీ వర్కౌట్ అయ్యింది.

ఈ సన్నివేశాలు చూస్తుంటే శ్రీను వైట్ల తన మార్క్ చూపించాడన్న ఫీల్ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా లాజిక్ లేకుండా మ్యాజిక్ చేసేశాడు. పోనీ సెకండ్ ఆఫ్ అయినా.. కథలో కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సేమ్ రోటీన్ స్టోరీకి కాస్తంత హంగులు, ఆర్భాటాలు, నాలుగు కామెడీ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్‌తో సరిపెట్టేశాడు. గతంలోని తన సినిమాలోని కొన్ని సీన్లు గుర్తుకు తెప్పిస్తుంటాయి. ఇక హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా కొత్తగా అనిపించదు. మిలాన్ సిటీలో పరిచయం, ఇండియా వచ్చాక హీరోయిన్ తండ్రితో పరిచయం సీన్లన్నీ దూకుడును తలపిస్తుంటాయి. రోటీన్ ఫార్ములా నుండి దర్శకుడు బయటపడలేదా అన్న సందేహం కలుగుతోంది.

కొన్ని సన్నివేశాలు అతనట్లుగా అనిపించినా కామెడీతో మేనేజ్ చేశాడు దర్శకుడు. రీచ్ లోకేషన్లలో షూటింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సెకండాఫ్ కాస్తంత జాగ్రత్తగా టేకప్ చేసి ఉంటే.. మ్యాచ్ స్టార్ ఖాతాలో బ్లాక్ బస్టర్ బొమ్మ పడినట్లే. అయితే శ్రీను వైట్ల గత కొన్ని డిజాస్టరలను చూస్తే.. విశ్వం చాలా వరకు బెటర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్య కాలంలో క్లైమాక్స్‌లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తున్నాయి. మరీ ఈ సినిమాకు అదే మిస్సయ్యినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర్లు పడితేనే బాగుందనిపిస్తుంది.

నటీనటులు- టెక్నికల్ విభాగం పనితీరు:

మ్యాచో స్టార్ గోపీచంద్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. కావ్య థాపర్.. గ్లామర్ షోకే పరిమితం చేసినట్లు అనిపిస్తుంది. శ్రీను వైట్ల సినిమాలో కథకు, హీరోయిన్లకు కనెక్షన్ బలంగా ఉంటుంది. ఇందులో ఉన్నట్లు అనిపించదు. ఇక విలన్ జిష్ణు సేన్ గుప్తాది రోటీన్ విలన్ పాత్ర. సినిమాలోకి వెళుతున్న కొద్దీ.. ఎన్నో పాత్రలు తెరపై కనిపిస్తూనే ఉంటాయి. నరేష్, ప్రగతి, సునీల్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, కిక్ శ్యామ్, ప్రవీణ్, భరత్, విటీవి గణేష్, శ్రీకాంత్ అయ్యర్ చెబుతా వెళితే తెరమీద బోలెడంత మంది ఆర్టిస్టులు ఉన్నారు. హీరో హీరోయిన్లను పక్కన పెడితే.. మిగిలిన వారంతా తమ కామెడీతో కితకితలు పెట్టించారు.

నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. పిక్చరైజేషన్ చాలా బాగుంది. కెవి గుహన్ కెమెరా పనితనం బాగుంది. ఇటలీ, జమ్ము కాశ్మీర్, గోవాలో లొకేషన్లను అందంగా చూపించారు. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సోసోగా ఉంది. చెప్పుకోదగ్గట్లుగా పాటలు ఉండవు. భీమ్స్ కంపోజ్ చేసిన గుంగురూ గుంగురూ ఒకే అనిపిస్తుంది. శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ చూపించినప్పటికీ.. రొటీన్ కథ, కథనం కనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ సెంటిమెంట్ పండింది. మరీ దసరా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి.. ఈ సినిమా వారికి నచ్చే అవకాశాలున్నాయి. లాజిక్ కాకుండా కడుపుబ్బా నవ్వుకోవాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.

బలాలు

కామెడీ

గోపి చంద్ నటన

కెమెరా వర్క్

బలహీనతలు

రోటీన్ కథ

ఓల్డ్ సినిమాలు గుర్తుకు తెచ్చేలా సీన్లు

క్లైమాక్స్

చివరిగా: కడుపుబ్బా నవ్వుకోవాలంటే విశ్వం చూడొచ్చు.

Show comments