iDreamPost
android-app
ios-app

Puri Jagannadh: బాలయ్యతో కాదు.. పూరి జగన్నాథ్ కొత్త మూవీ ఆ హీరోతో?

  • Published Sep 10, 2024 | 8:40 AM Updated Updated Sep 10, 2024 | 8:40 AM

Puri Jagannadh next movie: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ అనుకున్నరేంజ్ లో విజయం సాధించలేపోయింది. పూరి మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఆయన నుంచి నెక్ట్స్ రాబోయే సినిమా ఏది? హీరో ఎవరు? అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Puri Jagannadh next movie: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ అనుకున్నరేంజ్ లో విజయం సాధించలేపోయింది. పూరి మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఆయన నుంచి నెక్ట్స్ రాబోయే సినిమా ఏది? హీరో ఎవరు? అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Puri Jagannadh: బాలయ్యతో కాదు.. పూరి జగన్నాథ్ కొత్త మూవీ ఆ హీరోతో?

ఇండస్ట్రీలో హిట్టు ఇచ్చిన డైరెక్టర్స్, హీరోల దగ్గరకే నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ.. అందులో మెుదటి వరుసలో ఉన్నది మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. గతంలో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ తీయగా.. అది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే రామ్ పోతినేనితో తీసిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ పూరికి కచ్చితంగా కావాలి. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ మూవీ ఎవరితో తీస్తాడా? అంటూ అందరూ ఆసక్తికంగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. గత కొంత కాలంగా పూరి నుంచి ప్రేక్షకులను మెప్పించే సినిమాలు రావడం లేదు. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత ఈ డాషింగ్ డైరెక్టర్ ఎవరితో సినిమా తీస్తాడా? అని అందరూ ఎదురుచూస్తున్నాడు. అయితే బాలయ్య కోసం ఓ కథను సిద్దం చేశాడని, ఆ కథతోనే ఇప్పుడు రాబోతున్నాడని గతంలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. పూరి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో తీయట్లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ‘మ్యాచో స్టార్ గోపీచంద్’ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడట పూరి. దాంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది.

కాగా.. పూరి జగన్నాథ్-గోపీచంద్ కాంబినేషన్ లో గతంలో ‘గోలీమార్’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం సూపర్ హిట్ సాధించింది. గోపీచంద్ కు క్రేజ్ ను పెంచిన చిత్రాల్లో గోలీమార్ కూడా ఒకటి. మళ్లీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందని తెలియడంతో.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గోలీమార్ తో గోపీచంద్ లో ఉన్న మాస్ ను బయటకి తీసిన పూరి.. ఇప్పుడు ఏ రేంజ్ లో చూపిస్తాడా? అని అభిమానులు ఊహించుకుంటున్నారు. మరి ఈ కాంబో సెట్ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గోపీచంద్ ‘విశ్వం’ అనే మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ మూవీకి డైరెక్టర్ కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియో బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వేణు దొనేపూడి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet