iDreamPost
android-app
ios-app

కనిపించకుండా పోయిన ‘రణం’ మూవీ విలన్‌! తెలుగులో ఎందుకు నటించడం లేదంటే?

  • Published Aug 27, 2024 | 1:59 PM Updated Updated Aug 27, 2024 | 2:01 PM

అమ్మ రాజశేఖర్- గోపీచంద్ కాంబోలో వచ్చిన చిత్రం రణం. 2006లో వచ్చిన ఈ మూవీ హిట్ కొట్టింది. కామజెఠ్మలానీ హీరోయిన్. హీరోయిన్ అన్నగా నటించి భయపెట్టిన యాక్టర్ గుర్తున్నాడా..? తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదంటే..?

అమ్మ రాజశేఖర్- గోపీచంద్ కాంబోలో వచ్చిన చిత్రం రణం. 2006లో వచ్చిన ఈ మూవీ హిట్ కొట్టింది. కామజెఠ్మలానీ హీరోయిన్. హీరోయిన్ అన్నగా నటించి భయపెట్టిన యాక్టర్ గుర్తున్నాడా..? తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదంటే..?

  • Published Aug 27, 2024 | 1:59 PMUpdated Aug 27, 2024 | 2:01 PM
కనిపించకుండా పోయిన ‘రణం’ మూవీ విలన్‌! తెలుగులో ఎందుకు నటించడం లేదంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా మారిన తెరకెక్కించిన తొలి చిత్రం రణం. గోపిచంద్, కామజెఠ్మలానీ హీరో హీరోయిన్లు. 2006లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాదు.. కన్నడలో రీమేక్ కాగా, తమిళ్, హిందీ, ఒరియా భాషల్లో డబ్ చేశారు. ఇందులో నెగిటివ్ రోల్‌లో భగవతి పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..? హీరోయిన్ అన్నగా నటించి భయపెట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా..అలాగే రవితేజ ఖతర్నాక్ మూవీలో మెరిశాడు. తెలుగులో రెండంటే రెండు చిత్రాల్లో ఆంటోగనిస్టుగా కనిపించిన ఆయన ఆ ఇండస్ట్రీల్లో తోపు నటుల్లో ఒకరు. టాలీవుడ్‌లో నటించిన రెండు సినిమాలకు అమ్మ రాజశేఖరే దర్శకుడు. ఈ సినిమాల తర్వాత ఆయన తెలుగులో మళ్లీ కనిపించలేదు. అయితే ఆయన ఎవరు..తెలుగులో ఎందుకు నటించడం లేదంటే?

సృజనాత్మక చిత్రాలకు పెట్టింది పేరు మలయాళ ఇండస్ట్రీ. ఆ సినీ పరిశ్రమకు చెందిన నటుడే బిజు మీనన్. టాలీవుడ్‌లో రెండు చిత్రాలతో మెరిసిన ఈ నటుడు.. ఇప్పుడు అక్కడ బిజీయెస్ట్ స్టార్. ఒకప్పుడు తెలుగులో విలన్ పాత్రలో మెరిసిన ఆయన.. మాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కూడా. 1995 నుండి మాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 150కి పైగా చిత్రాల్లో నటించాడు. కేరళ స్టేట్ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎన్నింటినో తీసుకున్నాడు. కేరళలో పుట్టిన ఆయన.. ఐదుగురు సంతానంలో ఒకరు. చదువులు పూర్తయ్యాక టీవీ సీరియల్స్ చేసిన ఆయన.. ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. సపోర్టింగ్ రోల్స్ తో తనను తాను ప్రూవ్ చేసుకుని.. హీరోగా మారి సక్సెస్ అయ్యాడు.

ranam movie vilan

ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. అయ్యప్పన్ కోషియం మూవీలో నటనకు గానూ.. జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికే హీరోగా మారిన ఆయన వరుస మూవీలతో దూసుకెళుతున్నాడు. వరుసగా కీ రోల్స్ చేస్తున్నాడు. ఆరక్కారియం మూవీకి కేరళ స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. గరుడన్, తాళవన్, నాదన్న సంభవం చిత్రాలతో ఈ ఏడాది మలయాళ ప్రేక్షకులను పలకరించాడు. ఇవే కాకుండా ఆయన పలు తమిళ సినిమాల్లోనూ మెరిశాడు. ఓ కన్నడ చిత్రం చేశాడు. కదా ఇన్నువరే అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఆయన ప్రముఖ మలయాళ నటి సంయుక్త వర్మను వివాహం చేసుకున్నారు. మజాతో పాటు పలు చిత్రాల్లో ఈ ఇద్దరు నటించగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి దక్ష్ ధార్మిక్ అనే కొడుకున్నాడు. మాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావడం వల్ల మరో ఇండస్ట్రీలో ఆయన సినిమాలు చేయడం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Kadha Innuvare (@kadhainnuvare)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet