iDreamPost
android-app
ios-app

Sree Vishnu: భారీ రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు! మేకర్స్ కు తెలిసే చేస్తున్నారా?

  • Published Sep 04, 2024 | 10:20 AM Updated Updated Sep 04, 2024 | 10:20 AM

Sree Vishnu, Swag Movie: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు స్వాగ్ అనే ప్రయోగాత్మకమైన మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే అతడు భారీ రిస్క్ తీసుకుంటున్నాడని చాలా మంది అంటున్నారు. మరి శ్రీవిష్ణు తీసుకునే రిస్క్ ఏంటి? చూద్దాం పదండి.

Sree Vishnu, Swag Movie: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు స్వాగ్ అనే ప్రయోగాత్మకమైన మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే అతడు భారీ రిస్క్ తీసుకుంటున్నాడని చాలా మంది అంటున్నారు. మరి శ్రీవిష్ణు తీసుకునే రిస్క్ ఏంటి? చూద్దాం పదండి.

Sree Vishnu: భారీ రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు! మేకర్స్ కు తెలిసే చేస్తున్నారా?

శ్రీవిష్ణు.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. మెంటల్ మదిలో, నీదినాదీ ఒకే కథ, రాజారాజా చోర సినిమాలతో అభిరుచి గల హీరోగా గుర్తింపు పొందాడు. లేటెస్ట్ గా ఓం భీమ్ బుష్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. త్వరలోనే ‘స్వాగ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవిష్ణుకు మరో హిట్ ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో విడుదల తేదీ విషయంలో అతడు రిస్క్ చేస్తున్నాడని కొందరు సినీ విశ్లేషకులతో పాటుగా అభిమానులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

‘స్వాగ్’.. శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా. ఇటీవలే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నాలుగు విభిన్నమైన పాత్రల్లో నటించి అదరగొట్టాడు శ్రీవిష్ణు. అక్టోబర్ 4న థియేటర్లలోకి ఈ సినిమా రాబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఇక్కడే అసలు చిక్కు మెుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీతో సెప్టెంబర్ 27న థియేటర్లలో ఊచకోత కోయడానికి వస్తున్నాడు. తారక్ వచ్చిన వారం రోజుల గ్యాప్ లోనే స్వాగ్ తో శ్రీవిష్ణు వస్తుండటం రిస్క్ తో కూడుకున్న విషయమే. దేవరకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. కనీసం నాలుగు వారాలదాక థియేటర్లను హోల్డ్ చేస్తుంది. దీంతో స్క్రీన్ల విషయంలో స్వాగ్ సర్థుబాటు చేసుకోవాల్సి వస్తుంది.

అదీకాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచే అక్టోబర్ 11న శ్రీను వైట్ల-గోపీచంద్ ల ‘విశ్వం’ రాబోతోంది. రజినీకాంత్ వెట్టయాన్ కూడా అక్టోబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు రిస్క్ చేస్తున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. అయితే మేకర్స్ కు ఈ విషయం తెలిసే విడుదల చేస్తున్నారా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీపై మేకర్స్ కు, శ్రీవిష్ణు గట్టి నమ్మకం ఉండటంతోనే.. ఈ రిస్క్ కు సిద్దపడినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇంత పోటీలో శ్రీవిష్ణు ఏ రేంజ్ హిట్ కొడతాడో.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş