iDreamPost
android-app
ios-app

డబుల్ ఇస్మార్ట్ నుండి బ్లాస్టింగ్ న్యూస్! పోకిరి రేంజ్ క్లైమ్యాక్స్ ట్విస్ట్!

  • Published Aug 08, 2024 | 6:17 PM Updated Updated Aug 08, 2024 | 6:17 PM

పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న సెకండ్ పిక్చర్ డబుల్ ఇస్టార్ట్. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్. ఆగస్టు 15న విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తయ్యింది. పాజిటివ్ టాక్ నడుస్తుంది. అలాగే ఈ మూవీలో..

పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న సెకండ్ పిక్చర్ డబుల్ ఇస్టార్ట్. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్. ఆగస్టు 15న విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తయ్యింది. పాజిటివ్ టాక్ నడుస్తుంది. అలాగే ఈ మూవీలో..

  • Published Aug 08, 2024 | 6:17 PMUpdated Aug 08, 2024 | 6:17 PM
డబుల్ ఇస్మార్ట్ నుండి బ్లాస్టింగ్ న్యూస్! పోకిరి రేంజ్ క్లైమ్యాక్స్ ట్విస్ట్!

టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రాబోతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్. ఇస్మార్ట్ మూవీతో రామ్ పోతినేనికి ఉన్న లవర్ బాయ్ ను ఇమేజ్ పూర్తిగా మార్చేశాడు పూరీ. మరోసారి అతడ్ని దగఢ్ లుక్‌లో చూపించేందుకు రెడీ అయ్యాడు. అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్. ఆగస్టు 15న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించారు. మణిశర్మ బాణీలు సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కేక పుట్టిస్తుంది. ఇక మార్ మూంత సాంగ్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసేసిన సంగతి విదితమే. సంజయ్ దత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆలీ, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక వరుసగా ప్రమోషనన్లు షురూ చేశాడు రామ్ అండ్ కావ్య థాపర్. కాగా, ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత ఆలీ కూడా తన మార్క్ కామెడీ చేసేందుకు సిద్ధమయ్యాడట. సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయట. మొత్తంగా హిట్ కొట్టేందుకు అవసరమైన అన్నీ హంగులు ఉన్నాయని తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ పెన్ మార్క్ మరోసారి వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. డైలాగ్స్ తూటాల్లా పేలడం ఖాయమట. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ పోకిరీ రేంజ్‌లో ఉందని తెలుస్తుంది.  మదర్ సెంటిమెంట్ ఈ మూవీకి ప్లస్ కానుందట. ఇదే కనుక నిజమైన బాక్సాఫీసు వద్ద రీ సౌండ్ పేలడం ఖాయం.

మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి విదితమే. ఇందులో క్లైమాక్స్ హైలెట్. అప్పటి వరకు పోకిరీగా కనిపించే మిల్కీ బాయ్ మహేష్.. చివరిలో ఒక్కసారిగా కృష్ణ మనోహర్ ఐపీఎస్ అయిపోతాడు. ఇదే సినిమాకు హైలెట్. ఏమాత్రం ఊహించని ఈ ట్విస్టే.. పోకిరీ మూవీని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిపింది. తర్వాత పూరీ వేసిన దారిలోనే ఎంతో మంది డైరెక్టర్లు ట్విస్టులతో సినిమా క్లైమాక్స్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. తన సృష్టించిన ఇలాంటి క్లైమాక్స్ పూరీ నుండి చూసి చాలా కాలమైంది. ఇప్పుడు సెన్సార్ నుండి పోకిరీ లాంటి ట్విస్ట్ రాబోతుందంటూ టాక్ రావడంతో మరోసారి పూరీ మార్క్ కనిపించడం ఖామయని ఫిక్స్ అయిపోవచ్చు. పూరీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పక్కా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom