iDreamPost
android-app
ios-app

ఈ వారం ధియేటర్స్‌లో నలుగురు భామల మధ్య గ్లామర్ వార్! విన్నర్ ఎవరో?

  • Published Aug 12, 2024 | 6:27 PM Updated Updated Aug 12, 2024 | 6:38 PM

పంద్రాగస్టున సినిమా ప్రేక్షకులను పలకరించనున్నాయి నాలుగు సినిమాలు. ఇందులో మూడు తెలుగు చిత్రాలున్నాయి. నలుగురు హీరోయిన్స్ మధ్య గ్లామర్ వార్ నడవనుంది. మరీ విన్నర్ అయ్యే ఛాన్స్..

పంద్రాగస్టున సినిమా ప్రేక్షకులను పలకరించనున్నాయి నాలుగు సినిమాలు. ఇందులో మూడు తెలుగు చిత్రాలున్నాయి. నలుగురు హీరోయిన్స్ మధ్య గ్లామర్ వార్ నడవనుంది. మరీ విన్నర్ అయ్యే ఛాన్స్..

  • Published Aug 12, 2024 | 6:27 PMUpdated Aug 12, 2024 | 6:38 PM
ఈ వారం ధియేటర్స్‌లో నలుగురు భామల మధ్య గ్లామర్ వార్! విన్నర్ ఎవరో?

ఈ ఆగస్టు 15న సినీ ప్రేమికులను పలకరించబోతున్నాయి నాలుగు సినిమాలు. తమిళ డబ్బింగ్ పిక్చర్ తంగలాన్ మినహాయించి.. మిగిలినవన్నీ తెలుగు స్ట్రైట్ మూవీస్. రవితేజ- హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్, పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో రాబోతుంది డబుల్ ఇస్మార్ట్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా గోదారి బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న చిత్రం ఆయ్.  హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం 35 చిన్న కథ కాదు కూడా ఈ స్వతంత్య్ర దినోత్సవం నాడే సందడి చేసేందుకు ముందుకు రావాల్సి ఉంది పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ నాలుగు సినిమాల్లో ఏదీ హిట్టో, ఏదీ ఫట్టో పక్కన పెడితే.. ఈ మూవీల ద్వారా నలుగురు ముద్దుగుమ్మలు గ్లామర్ వార్ నడవనుంది. ఇంతకు ఆ బ్యూటీలు ఎవరంటే..?

ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ మూవీ రిలీజ్ కానేలేదు తన ఛార్మింగ్‌తో మెస్మరైజ్ చేస్తుంది. బచ్చన్ నుండి సితార్ సాంగ్ రిలీజ్ చేయగానే.. అమ్మడికి ఫ్లాట్ అయిపోయారు కుర్రకారు. ఈ మధ్య వరుస ప్రమోషన్లలో తన హాట్ అందాలతో చెమటలు పట్టించింది. దీంతో సినిమా విడుదల కాకుండానే హైప్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే మాత్రం.. అమ్మడ్ని టాప్ హీరోయిన్ కాకుండా ఆపడం కష్టం. ఇప్పటికే వరుస ఆఫర్లను లైన్లో పెడుతుందని ఇన్నర్ టాక్. ఇక డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న మరో బ్యూటీ కావ్య థాపర్. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళంలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన కావ్య కూడా ఏమాత్రం తీసిపోని పోటీనిస్తుంది. ఇప్పటికే విడుదలైన మార్ ముంతా సాంగ్‌లో తన ఫెర్మామెన్స్‌తో ఈలలు వేయించుకుంటుంది. గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడటం లేదు.

తంగలాన్ మూవీతో తెలుగు వారితో టచ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది రాజా సాబ్ బ్యూటీ.. మాళవికా మోహనన్.  ప్రభాస్ మూవీతో త్వరలో  తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.  ఈ సినిమా హిట్ కావడం ఈ మలయాళ బ్యూటీకి అవసరం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. తెలుగు తెరకు ఇటీవల పరిచయమైన గర్ల్ నెక్ట్స్ డోర్ నయన సారిక. ఆనంద్ దేవరకొండ గం గం గణేశాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆయ్ అంటూ మరోసారి పలకరించబోతుంది. ఆయ్ మూవీ కనుక ప్రేక్షకులను మెప్పించగలిగితే.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీ స్టార్ అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరందరికీ లక్ వరించి.. టాలీవుడ్ మూవీలతో మనల్ని కనువిందు చేద్దామని ఆశిద్దాం.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio