iDreamPost
android-app
ios-app

తెలంగాణ సాధించావా? 11 రోజులు అన్నం మానేసింది నువ్వే కదా పవన్?

  • Published Nov 08, 2023 | 12:55 PM Updated Updated Nov 08, 2023 | 12:55 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎల్‌బీ నగర్‌లో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగిస్తూ.. పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎల్‌బీ నగర్‌లో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగిస్తూ.. పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Nov 08, 2023 | 12:55 PMUpdated Nov 08, 2023 | 12:55 PM
తెలంగాణ సాధించావా? 11 రోజులు అన్నం మానేసింది నువ్వే కదా పవన్?

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో 22 రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్ని ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించడం కోసం తెలంగాణలో పర్యటించారు. హైదాబాద్‌ ఎల్బీ నగర్‌లో కమలం పార్టీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు మోదీ. ఇక ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దాంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై యావత్‌ తెలంగాణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌లా మాట మార్చడం.. సీనియర్‌ నాయకుల వల్ల కూడా కాదంటూ విస్తుపోతున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో చేసిన వ్యాఖ్యలు మర్చిపోయావా పవన్‌ అని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ ఎల్‌బీ స్టేడియంలో తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించాము అన్నారు. అయితే పవన్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు అన్నం మానేసింది నువ్వే కదా పవన్‌

నేడు రాజకీయాల కోసం, తెలంగాణలో జనసేన ఉనికిని చాటు కోవడం కోసం.. తెలంగాణ ఏర్పాటు గురించి ఇంతలా ప్రశంసిస్తున్న పవన్‌.. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమాన్నారో మర్చిపోయారా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ పరిస్థితి చూసి నాకు ఏడుపు వచ్చింది.. బాధతో 11 రోజులు అన్నం మానేశాను అన్నావు.. ఆ విషయం గుర్తు లేదా.. లేక ఎన్నికల కోసం మర్చిపోయావా పవన్‌ అని ప్రశ్నిస్తున్నారు జనాలు.

తెలంగాణ అంటే నీకు ఎంత ప్రేమ ఉందో.. ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు.. ఇప్పుడేదో ఓట్ల కోసం నువ్వు డైలాగ్‌లు చెబితే.. నమ్మేంత పిచ్చి వాళ్లు ఎవరూ లేరంటున్నారు. పవన్‌ ప్రసంగం నేపథ్యంలో భాగంగా ఆయన గతంలో రాష్ట్ర ఏర్పాటు గురించి చేసిన వీడియో.. నిన్న సమావేశంలో మాట్లాడిన వీడియోలను వైరల్‌ చేస్తున్నారు.

ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ..

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా.. జనసేనకు 8 సీట్లను  కేటాయించింది.  తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడ పోటీ చేయడమే వింత అంటే.. అందులోనూ బీజేపీతో పొత్తు మరింత చిత్రంగా ఉంది. ఏపీలో బీజేపీకి దూరం.. తెలంగాణలో మాత్రం కమలంతో పొత్తు ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ తీరుపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీకి చెడు తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు.  తన నిర్ణాయల గురించి పవన్‌కు అవగాహాన ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

నాడు: రాష్ట్రం విడిపోయిందుకు బాధపడ్డాను-పవన్‌

నేడు: తెలంగాణ సాధించాం-పవన్‌