సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు భారీ ఊరట.. ఏ విషయంలో అంటే

Supreme Court-TG Governor Quota MLC: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట లభించింది. ఆ వివరాలు..

Supreme Court-TG Governor Quota MLC: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట లభించింది. ఆ వివరాలు..

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను నామినేట్ చేశారు. అయితే ఈ జాబితాను అప్పటి గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. దాంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లారు. ఈ వివాదం కోర్టులో ఉండగానే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. కొత్తగా కోదండరామ్‌, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం.. దానికి గవర్నర్‌ కూడా ఆమోదముద్ర వేయడం జరిగింది. ఈ చర్యలను సవాలు చేస్తూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో, కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని ఆదేశాలిచ్చింది హైకోర్టు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ కి ఊరట లభించింది. ఆ వివరాలు..

ఈ ఎమ్మెల్సీల నియమాకాల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ విధించడమే కాక.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాక కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… గవర్నర్‌, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్రల ధర్మాసనం చెప్పుకొచ్చింది.

Show comments