Swetha
Andala Rakshasi : మొదట్లో అప్పుడప్పుడు రిలీజ్ చేసిన రీరిలీజ్ లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కనీసం నెలకి రెండు మూడు రీరిలీజ్ సినిమాలైనా థియేటర్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన రీరిలీజ్ ల కోసం ఎంతమంది వెయిట్ చేసారో తెలియదు కానీ. ఈ రీరిలీజ్ కోసం మాత్రం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారన్నమాట వాస్తవం.
Andala Rakshasi : మొదట్లో అప్పుడప్పుడు రిలీజ్ చేసిన రీరిలీజ్ లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కనీసం నెలకి రెండు మూడు రీరిలీజ్ సినిమాలైనా థియేటర్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన రీరిలీజ్ ల కోసం ఎంతమంది వెయిట్ చేసారో తెలియదు కానీ. ఈ రీరిలీజ్ కోసం మాత్రం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారన్నమాట వాస్తవం.
Swetha
హిట్ సినిమా డిజాస్టర్ సినిమా అనే తేడా లేకుండా.. కంటెంట్ బావుంది అనిపిస్తే బ్యాక్ టు బ్యాక్ పాత సినిమాలను రీరిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. మొదట్లో అప్పుడప్పుడు రిలీజ్ చేసిన రీరిలీజ్ లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కనీసం నెలకి రెండు మూడు రీరిలీజ్ సినిమాలైనా థియేటర్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన రీరిలీజ్ ల కోసం ఎంతమంది వెయిట్ చేసారో తెలియదు కానీ. ఈ రీరిలీజ్ కోసం మాత్రం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారన్నమాట వాస్తవం.
ప్రేమ గురించి ప్రేమగా చెప్పే సినిమాలు కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన అందాల రాక్షసి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. కొన్ని సినిమాల విలువ మొదటి సారి థియేటర్ లో చూసినప్పుడు ఎవరికీ అర్థంకాదు. కానీ ఆ తర్వాత మాత్రం అర్రే దీన్నెలా మిస్ చేశాంరా అని అనుకుని ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రేక్షకులు. అందాల రాక్షసికి విషయంలో కూడా ఇదే జరిగింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. కచ్చితంగా యూత్ ఈ సినిమాను హోల్ హాటెర్డ్ గా వెల్కమ్ చేస్తారని చెప్పొచ్చు. డెప్త్ ఉన్న ప్రేమ కథ , లోతైన ఎమోషన్స్ , ఇక సినిమా పాటలైతే ఇప్పటికి అందరికి ఫేవరేట్ ఆల్బమ్ లిస్ట్ లో టాప్ లోనే ఉంటుంది. సో కచ్చితంగా ఇంకొద్ది రోజుల్లో థియేటర్స్ లో మరో మ్యూజిక్ కాన్సెర్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా జూన్ 13 న రీరిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.