Thug Life Movie Review In Telugu: కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన మూవీ థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్యన ఈ మూవీ జూన్ 5 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు 38 ఏళ్ళ మరోసారి వీరిద్దరూ జతకట్టారు.మరి అనుకున్నట్లుగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా .. మణిరత్నం కమల్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా ? అసలు సినిమా ఎలా ఉంది ?అనేది చూసేద్దాం
Thug Life Movie Review In Telugu: కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన మూవీ థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్యన ఈ మూవీ జూన్ 5 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు 38 ఏళ్ళ మరోసారి వీరిద్దరూ జతకట్టారు.మరి అనుకున్నట్లుగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా .. మణిరత్నం కమల్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా ? అసలు సినిమా ఎలా ఉంది ?అనేది చూసేద్దాం
Swetha
కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన మూవీ థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్యన ఈ మూవీ జూన్ 5 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు 38 ఏళ్ళ మరోసారి వీరిద్దరూ జతకట్టారు. దీనితో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకాస్త ఎక్కువ స్పందన లభించింది. మరి అనుకున్నట్లుగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా .. మణిరత్నం కమల్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా ? అసలు సినిమా ఎలా ఉంది ?అనేది చూసేద్దాం
కథ :
కమల్ హాసన్ తన అన్న మాణిక్యంతో కలిసి ఢిల్లీలో గ్యాంగ్స్టర్ గా ఓ గ్యాంగ్ ను నడుపుతూ ఉంటాడు. వీరికి సదానంద్ అనే గ్యాంగ్ తో వార్ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓసారి సదానంద్ కమల్ హాసన్ గ్యాంగ్ ను పట్టించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కమల్ హాసన్ ఓ పిల్లాడిని (శింబు) ని ఉపయోగించి తప్పించుకుంటాడు. ఇక అప్పటినుంచి కమల్ శింబుని సొంత కొడుకుల పెంచుకుంటాడు. కొంతకాలానికి శింబు కూడా ఆ వాతావరణానికి అలవాటు పడతాడు. అలా ఓసారి కమల్ హాసన్ ఓ దాడి విషయంలో శింబుపై అనుమాన పడతాడు. అదే సమయంలో తన తండ్రిని చంపేసింది కమల్ హాసన్ నే అని శింబు కి తెలుస్తుంది. దీనితో అతను కమల్ ను లోయలోకి తోసేస్తాడు. కమల్ చనిపోయాడనుకుని అతని సామ్రాజ్యాన్ని శింబు తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత కమల్ మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏమైంది ? కమల్ తన సామ్రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడా లేదా ? కమల్ భార్య , కూతురు ఏమౌతారు ? చివరికి ఏమైంది ? ఇవన్నీ బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల పని తీరు :
మెయిన్ గా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది కమల్ హాసన్ గురించి. రంగరాయ శక్తి రాజు అనే గ్యాంగస్టర్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ పరకాయ ప్రవేశం చేశారు. గతంలో ఇలాంటి తరహా పాత్రలలో ఆయన తన నట విశ్వ రూపం చూపించారు. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయింది. కొన్ని కొన్ని సార్లు ఆయన కేవలం కళ్ళతోనే ఆ సన్నివేశాలకు ప్రాణం పోశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటనలో లోకనాయకుడిగా పేరొందిన సినిమాలలో ఈ సినిమా కూడా యాడ్ అవుతుంది. ఇక మూవీకి ఇంకొక యాడ్ ఆన్ శింబు. శింబు ఎప్పటిలానే తన ఫైట్స్ , యాక్షన్ సీన్స్ తో మెప్పించేశాడు. వీరిద్దరూ కాకుండా ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన క్యారక్టర్ త్రిష దే. ఇప్పటివరకు త్రిష ఎప్పుడు కనపడని క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించింది. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఎవరు చూపు తిప్పుకోకుండా చూడాల్సిందే. ఇక మిగిలిన యాక్టర్స్ అంతా కూడా తమ తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పని తీరు :
ఈ విషయంలో ముందు సినిమాట్రోగ్రాఫర్ కు మొదటి ప్లేస్ ఇవ్వొచ్చు. సినిమాలో చాలా ఫ్రేమ్స్ బాగా అడ్వాన్స్డ్ గా కనిపిస్తాయి. కొన్నైతే స్క్రీన్ ప్లే లో మెయిన్ రోల్ పోషించాయని చెప్పొచ్చు. మ్యూజిక్ పరవాలేదనిపించింది. ఆర్ట్ వర్క్, క్యాస్టూమ్ ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి. మణిరత్నం సినిమాలో కెమెరా వర్క్ టాప్ నాచ్గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాణ పరంగా మూవీ చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది/ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ కు తగినట్టు అదిరిపోతుంది. ఎడిటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఇంకాస్త అదిరిపోయేది. ఈ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ అయితే కచ్చితంగా నవ్వించేస్తాయని చెప్పాల్సిందే. ఫైట్స్ కూడా రొటీన్ గా కాకుండా కొంచెం స్టైలిష్ గా అనిపిస్తాయి.
విశ్లేషణ :
కమల్ హాసన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమా నాయగన్ ను మించి ఉంటుందని అన్నారు. దీనితో అభిమానులు ఎక్కడలేని అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కు వెళ్తారు. కానీ కొద్దిసేపటికే ఓ గ్యాంగ్స్టర్ మూవీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజానికి గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో కథలు రావడం కొత్తేమి కాదు. కానీ దానికి కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ ఇచ్చాడు మణిరత్నం. సినిమా మొత్తం చూసిన తర్వాత సరే పరవాలేదు అనిపించుకున్న సరే. మణిరత్నం సినిమా చుసాము అనే హై ఫీలింగ్ అయితే ఉండకపోవచ్చు. నిజానికి గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కథలకు ఇంతకుమించి ఆశించలేము కూడా. కానీ కమల్ ఈ సినిమాను నయగాన్ తో కంపేర్ చేయకుండా ఉండాల్సింది. దానివలన ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు.
ఇక కమల్ ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటూనే.. మరోవైపు ప్రేమాయణం సాగిస్తూ ఉంటాడు. నిజానికి ఈ స్టోరీలైన్ చాలా కథలలో కనిపిస్తూనే ఉంటుంది. గ్యాంగ్స్టర్ కథలలో ఇది కామన్ ప్లాట్ అని చెప్పొచ్చు. కొత్తదనం ఆశించి సినిమాకు వెళ్తే మాత్రం ప్రేక్షకులకు కాస్తంత నిరాశ తప్పదు. కానీ కమల్ , త్రిష , శింబు తమ క్యారెక్టర్స్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యి సన్నివేశాలకు ప్రాణం పోశారో చూడాలి అనుకుంటే.. ఈ సినిమా ఓ గుడ్ ఫీల్ ను ఇస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే మాత్రం శాటిస్ఫై అవ్వొచ్చు.
ప్లస్ లు :
మైనస్ లు :
రేటింగ్ : 2.25/5
చివరిగా : ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ‘థగ్ లైఫ్’ ఎంజాయ్ చేయొచ్చు