iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో కూడా !

  • Published Jun 05, 2025 | 11:15 AM Updated Updated Jun 05, 2025 | 11:15 AM

తెలుగు దర్శకుడు తెరకెక్కించిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఓటిటి లోకి వచ్చేసింది. అదే జాట్ మూవీ. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిలో సన్నీ డియోల్ హీరోగా చేసాడు. ఈ సినిమా ఎప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

తెలుగు దర్శకుడు తెరకెక్కించిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఓటిటి లోకి వచ్చేసింది. అదే జాట్ మూవీ. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిలో సన్నీ డియోల్ హీరోగా చేసాడు. ఈ సినిమా ఎప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

  • Published Jun 05, 2025 | 11:15 AMUpdated Jun 05, 2025 | 11:15 AM
OTT లోకి వచ్చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో కూడా !

తెలుగు దర్శకుడు తెరకెక్కించిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఓటిటి లోకి వచ్చేసింది. అదే జాట్ మూవీ. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిలో సన్నీ డియోల్ హీరోగా చేసాడు. ఈ సినిమా ఎప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్‌.. బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

జాట్ సినిమా కథ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‍లోని మోటుపల్లి గ్రామానికి రణ్‍దీప్ హుడా శ్రీలంక నుంచి వస్తాడు. అతను తన తమ్ముడితో కలిసి ఎన్నో అరాచకాలు చేస్తూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా కొన్ని కారణాల వలన ఆ ఊరి మీదుగా వెళ్తున్న ఓ ట్రైన్ అక్కడే ఆగిపోతుంది. అదే ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్న సన్నీ డియోల్ కు ఆకలి వేయడంతో ఆ ఊరిలోని హోటల్ కు వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో కొందరు రౌడీలు అక్కడ హల్చల్ చేస్తారు. అది కాస్త సన్నీ డియోల్ కు ఇబ్బంది కలిగిస్తుంది. దీనితో అంతకు అంత గొడవ పెరుగుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? అసలు రణదీప్ ను చూసాక సన్నీ డియోల్ కు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? చివరి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్ సీన్స్ , ఫైట్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. పైగా ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా ఈ సినిమా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.