Dharani
Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ వివరాలు..
Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ వివరాలు..
Dharani
ప్రముఖ నటుడు, ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తాజాగా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను చంపింది చంద్రబాబే అంటూ తీవ్ర విమ్శలు చేశారు. అప్పట్లో ఐదు జిల్లాల్లో వంగవీటి రంగా అంటే.. సీనియర్ ఎన్టీఆర్ కన్నా గొప్పవాడని.. అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. రంగా కారులో చిన్న కర్ర దొరికితే.. దాన్ని సాకుగా చూపించి.. ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని.. తనను చంపేస్తారని రంగాకు కూడా ఒకానొక దశలో అర్థం అయ్యిందన్నారు పోసాని.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. ‘‘కాపుల ఆశాజ్యోతి వంగవీటి రంగా. మా అందరికి ఆయన పెద్ద హీరో. ఆయన్ని ఎలా చంపారో ఈ పోస్టర్ మీకు చెబుతుంది. రంగాను చంపించింది నారా చంద్రబాబు నాయుడు. రంగాను ఎవరు చంపించారో ఆయన కొడుకుతో పాటు.. కాపులందరికీ తెలుసు. రంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుంటూరు, కృష్ణా, గోదావరి, ప్రకాశం అయిదు జిల్లాల్లో మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లపై ప్రభావం చూపగలిగాడు’’ అని గుర్తు చేసుకున్నారు.
‘‘ఎన్టీఆర్ కన్నా రంగాకు ఎక్కువ మంది అభిమానులున్నారని.. ఆయనను చంపించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు. ఆ రోజుల్లో రంగాను ఎంత హింసించారో అందరికి తెలసు. చనిపోతే బాగుండే అనే పరిస్థితులు కల్పించారు. తనకు ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కోసం.. అప్పట్లో సీఎం రామారావుకి, హోం మినిస్టర్ కోడెలకు రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. చంద్రబాబు వల్ల రంగాకు భద్రత రాలేదు.. దాంతో సెక్యూరిటీ కోసం కేంద్రానికి లేఖ రాశాడు. అది వచ్చే లోపే రంగాను రోడ్ మీద నరికి చంపారు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘సలహాలు ఇచ్చేవారంతా వైఎస్సార్‌సీపీ కోవర్టలంటూ పవన్ ఆరోపిస్తున్నాడు. మరి ముద్రగడను చంద్రబాబు ఎంత వేధించారో అందరికి తెలుసు. మరి అప్పుడ పవన్ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ గగ్గొలు పెట్టాడు. ఆయన నాదెండ్ల మనోహర్‌ను తన వెనకాల పెట్టుకున్నాడు.. చంద్రబాబును మాత్రం తన గుండెల్లో పెట్టకున్నారు. కాపులను తిట్టిన వారితో పవన్ ఇప్పుడు ఎందుకు కలిశాడో చెప్పాలని’’ పోసాని డిమాండ్ చేశారు.