Pawan Warning To Cader Over Alliance: ఫ్యాన్స్ కి పవన్ ద్రోహం! నమ్ముకున్న వారిని బయటకి పొమ్మంటూ!

Pawan Kalyan: ఫ్యాన్స్ కి పవన్ ద్రోహం! నమ్ముకున్న వారిని బయటకి పొమ్మంటూ!

టీడీపీ-జనసేన పొత్తును ఎవరూ వ్యతిరేకించినా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా.. పార్టీ నుంచి బయటకు పంపిస్తానని.. వారంతా వైసీపీ కోవర్టులంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

టీడీపీ-జనసేన పొత్తును ఎవరూ వ్యతిరేకించినా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా.. పార్టీ నుంచి బయటకు పంపిస్తానని.. వారంతా వైసీపీ కోవర్టులంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తోన్న సంగతి తెలిసిందే. అవినీతిని అంతం చేస్తాను.. అలుపెరగని పోరాటం చేస్తాను అంటూ పెద్ద పెద్ద డైలాగ్ లు కొట్టి రాజకీయ పార్టీ పెట్టి.. పాలిటిక్స్ లోకి ప్రవేశించారు పవన్ కళ్యాణ్. మరి పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారా అంటే లేదు. చంద్రబాబుతో పొత్తు గురించి ప్రకటించినప్పుడే పవన్ పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కాడని.. ఆయనకు తన ప్రయోజనాలు తప్ప.. కేడర్, కార్యకర్తల గురించి పట్టించుకోరని అర్థం అయ్యింది. అవినీతిని అంతం చేస్తానని ప్రకటించిన పవన్.. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకి మద్దతు ఇవ్వడమే కాక.. పొత్తు ఉంటుందని ప్రకటించి తన వైఖరి ఏంటో స్పష్టం చేశారు. చాలా మంది జనసేన నేతలు, కార్యకర్తలకు ఈ నిర్ణయం నచ్చలేదు. కొందరు బహిరంగంగానే వ్యతిరేకించారు.

పొత్తుల నిర్ణయాన్ని వ్యతిరేకించేవారిని పార్టీ నుంచి బయటకు పంపేశారు పవన్. ఇక తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పవన్.. టీడీపీతో పొత్తు గురించి వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. ఆఖరికి చిన్న కార్యకర్త కామెంట్ చేసినా ఊరుకునేది లేదన్నారు. అలాంటివారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా భావిస్తానని.. గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పొత్తు నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే నిరంభ్యతరంగా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. ఆషామాషీగా ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతేకాక యువగళం కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అంతా పాల్గొనాలని.. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో జనసేన శ్రేణులు కలిసి పని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.

పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో కేడర్ ని, కార్యకర్తలని కలుపుకుపోవాలి. వారిని మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయాలను వారి చేత అంగీకరింపజేసుకోవాలి. ఏ విషయం గురించి అయినా సరే.. వారి మనసు నొచ్చుకునేలా వ్యాఖ్యలు చేయకూడదు. కానీ పవన్ తీరు చూస్తే.. ఆయనకు ఈ విషయం అర్ధం కాలేదా.. లేక తనను తానే దైవాంశ సంభూతుడిగా భావిస్తే.. నా మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారా అనేది అర్థం కాక ఆ పార్టీ నేతలే జుట్టు పట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో నలుగురికి నచ్చే మార్గంలో మనం ముందుకు వెళ్లాలి తప్పా.. ఆదేశాలు జారీ చేస్తే మొదటికే మోసం వస్తుంది.. కానీ పవన్ ఈ చిన్న లాజిక్ ని మర్చి పోతున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

టీడీపీ కోసం ఫ్యాన్స్ కు ద్రోహం..

పవన్ అభిమానులతో పాటు.. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరిన వారు ఉన్నారు. పవన్ అయినా పార్ట్ టైమ్ రాజకీయాలు చేశాడేమో కానీ.. పార్టీ కార్యర్తలు మాత్రం.. ఈ తొమ్మిదేళ్ల నుంచి జనసేనతోనే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నమ్మకంగా పని చేసిన వారిని.. ఇలా నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లి పొండి అంటూ కఠినంగా వ్యవహరించడం ఏమాత్రం మంచి పద్దతి కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ నిర్ణయాన్ని కాదంటే.. పార్టీకి ద్రోహం చేయడం ఏలా అవుతుంది. అంటే కనీసం తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు, నేతలు.

టీడీపీ కోసం.. పార్టీ ప్రయోజనాలను సైతం పక్కకు పెట్టి.. నమ్ముకున్న అభిమానులకు పవన్ ద్రోహం చేస్తున్నాడని.. ఆయననే నమ్ముకుని.. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని బయటకు పొమ్మంటూ వ్యాఖ్యానించడం దారుణమని వాపోతున్నారు. రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడిల్సిన అవసరం ఉన్న ఈరోజుల్లో.. పవన్ ఇంత ఆలోచన లేకుండా వ్యాఖ్యానించడం.. ఆయనకే చేటు చేస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show comments