పవన్‌ అసలు రంగు ఇదే.. TDPని ఆదుకోవడం కోసమే ఆ పార్టీతో పొత్తట

Pawan Kalyan: ఏపీ బాగు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న పవన్‌ ఇప్పుడు తన అసలు రంగు బయటపెట్టాడు. టీడీపీని ఆదుకోవడం కోసమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

Pawan Kalyan: ఏపీ బాగు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న పవన్‌ ఇప్పుడు తన అసలు రంగు బయటపెట్టాడు. టీడీపీని ఆదుకోవడం కోసమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాగు కోసం..  తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అంటూ ఇన్నాళ్లు పదే పదే చెప్తూ వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాజాగా మాట మార్చాడు. ఇన్నాళ్లు రాష్ట్రం బాగు కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అన్న పవన్‌ ఇప్పుడు మాత్రం.. టీడీపీని ఆదుకోవడం కోసమే ఆ పార్టీతో జట్టు కట్టినట్లు స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి చేయి అందించి.. పైకి లేవడానికి సాయం చేయడం కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అంటూ తన అసలు రంగు బయట పెట్టాడు పవన్‌.

అంతేకాక జనసేన దగ్గర ధైర్యం ఉంది.. పోరాడే పటిమ ఉంది కానీ.. ఎలక్షనీరింగ్‌ చేసి ఓట్లు తెప్పించి సామార్థ్యం లేదని స్వయంగా ఒప్పుకున్నాడు పవన్‌. అయితే పవన్‌ ఇలా మాట మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా పవన్‌ తీరే అంతా అంటున్నారు నెటిజనులు. తమ పార్టీ లక్ష్యం అవినీతి నిర్మూలన అని ప్రకటించిన పవన్‌.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని.. అక్కడే ఆయన వైఖరి ఏంటో స్పష్టంగా అర్థం అవుతుంది అంటున్నారు.

అలానే ఇన్నాళ్లు తాను మనీ పాలిటిక్స్‌ చేయలేనని చెప్పిన పవన్‌ తాజాగా మాట మార్చాడు. గతంలో ఎన్నికల్లో డబ్బులు పంచకపోవడం వల్లే ఓడిపోయాను అన్న పవన్‌.. తాజాగా మాట మారుస్తూ.. ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కనీసం భోజనాలకైనా డబ్బు ఖర్చు పెట్టకపోత ఎలా.. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం. ఓట్లు కొనాలా లేదా అనే నిర్ణయం మీరే తీసుకోండి. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని నేను ఎవరికీ చెప్పలేదు అంటూ మరోసారి మాట మార్చారు.

ఇక పొత్తు అంశంపై కూడా ఇలానే మాట మార్చాడు పవన్‌. ఇన్నాళ్లు రాష్ట్ర బాగు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అన్న పవన్‌.. ఇప్పుడు మాత్రం.. కష్టాల్లో ఉన్న టీడీపీని ఆదుకోవడం కోసమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను అనడం జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందో.. తన స్వార్థం కోసం ఆయన ఎవరినైనా మోసం చేయడానికి కూడా వెనకాడరు అనే సంగతి బహిరంగ రహస్యమే. అలాంటి చంద్రబాబును నమ్మి.. టీడీపీతో పొత్తు పెట్టుకుని.. సొంత పార్టీ నేతలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ పవన్‌పై జనసేన కేడరే అసంతృప్తిగా ఉన్నారు. అంటే పవన్‌కు పార్టీ ప్రయోజనాల కన్నా.. టీడీపీ బాగుండటమే ముఖ్యం అని మరోసారి నిరూపితం అయ్యింది అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Show comments