nagidream
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు రిజర్వేషన్ అమలు చేయమని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి పద్దతుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు రిజర్వేషన్ అమలు చేయమని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి పద్దతుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
nagidream
రిజర్వేషన్ ప్రస్తుతం ఏపీలో కాకరేపుతున్న అంశం. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వరని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్ సహా ముస్లిం రిజర్వేషన్లు అవసరం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. దీంతో ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేనాని మద్దతు ఇచ్చినట్లయ్యింది. అంతేకాకుండా అందరికీ రిజర్వేషన్ కావాలంటే అది కుదిరే పని కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.
రిజర్వేషన్ కి బదులు వేరే ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు పవన్. దానికి సదరు జర్నలిస్ట్.. ముస్లింల రిజర్వేషన్లు అమలు చేయబోమని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు కదా.. మరి మీకు నిరాశ లేదా అని ప్రశ్నించారు. దానికి పవన్ స్పందిస్తూ.. ఈ విషయంలో తానేమీ నిరాశ చెందడం లేదని అన్నారు. రిజర్వేషన్లు కావాలని కోరుకునే అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడం అంటే అసాధ్యం అని అన్నారు. కాపు కులాల రిజర్వేషన్ కోసం కూడా కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారని.. అయితే అందరికీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది కుదరదని అన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని.. అయితే రిజర్వేషన్ కల్పించడానికి వీలు లేనప్పుడు వేరే మార్గాల గురించి ఆలోచించాలని అన్నారు.
కానీ ఇంటర్వ్యూలో ఇలా ముస్లింల రిజర్వేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనారిటీల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తాను అండగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన దానికి.. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకు అస్సలు పొంతన లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలతో కూటమికి అటు కాపుల నుంచి ఇటు ముస్లింల నుంచి పెద్ద దెబ్బ పడేట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. మరి కాపులకు, ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.