Tirupathi Rao
Fans Angry On Pawan Kalyan: పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నాక ఫ్యాన్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్లు రియాలిటీలోకి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుందేమో?
Fans Angry On Pawan Kalyan: పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నాక ఫ్యాన్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్లు రియాలిటీలోకి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుందేమో?
Tirupathi Rao
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ గా ఎంతటి హిట్టో.. పొలిటికల్ స్టార్ గా మాత్రం అంతటి ఫ్లాప్. పదేళ్ళ క్రితం పార్టీ పెట్టిన పవన్ ఈ నాటికీ సాధించింది శూన్యం. 2014 ఎన్నికల్లో టీడీపీ జెండా మోసిన పవన్.. 2019లో ఒంటరిగా పోటీ చేసి చిత్తు అయ్యాడు. తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి.. రాజకీయాల్లో కామెడీ పీస్ గా మిగిలిపోయాడు. నిజానికి రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. కానీ.., పవన్ మాత్రం ఓటమి నుండి ఎలాంటి పాఠం నేర్చుకోలేదు. గ్రామ స్థాయిలో క్యాడర్ ని నిర్మించుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడికక్కడ కార్యవర్గ కమిటీలను నియమించుకోలేదు. దీంతో జనసేన పార్టీ ఇన్నాళ్లు ఓ దిశ దశ లేకుండా సాగుతూ వచ్చింది. ఇక సాధారణ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. పవన్ మాత్రం పొత్తు కోసం వెంపర్లాడి.. తనని నమ్మిన కార్యకర్తల చేత మరోసారి టీడీపీ జెండాలు మోయించడానికి సిద్ధమయ్యాడు. ఇక పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకుని పవన్ మరోసారి బాబు పట్ల తన విధేయతని చాటుకున్నాడు.
50 నుండి 60 సీట్లు కోరకుండా.., 24 సీట్లు ముష్టి వేస్తే దానికి ఎలా అంగీకరించావ్ అంటూ పవన్ పై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కుల పెద్దలు అయితే జనసేనానిని నమ్మడం వ్యర్థం అని అర్థం చేసుకున్నారు. ఇలా అందరూ తిట్టి పోస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కి మరో కొత్త కష్టం వచ్చి పడింది. పవన్ తన 24 స్థానాలకి గాను.. కేవలం ముగ్గురు పేర్లని మాత్రమే ఫైనల్ చేశాడు. మిగతా స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అన్నది ఇంకా ప్రకటించలేదు. దీనికి కారణం మిగతా స్థానాల్లో అభ్యర్థులు లేకపోవడమే అట. గోదావరి జిల్లాల నుండి అతి తక్కవ సీట్లు లభించాయి. దీంతో.. అక్కడ నేతలు అంతా పవన్ రాజకీయ వ్యూహాన్ని తప్పు పడుతూ పార్టీకి దూరం అవుతున్నారు.
ఇక సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్స్ ఎవ్వరూ కూడా పవన్ వెంట నడవడానికి ఇష్ట పడటం లేదు. ఆఖరికి తన స్థానం కూడా తాను డిసైడ్ చేసి చెప్పలేని స్థితిలో జనసేనాని ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. 24 సీట్లని హ్యాండిల్ చేయడమే కష్టంగా మారిన నేపథ్యంలో.. తన అభిమానులు, కార్యకర్తలు ఇంకా స్థానాలు ఆశించడం, అలా జరగలేదని తనని విమర్శించడం పవన్ కి మింగుడు పడటంలేదట. 50 స్థానాలు తీసుకున్నా మనం ఎలా గెలుస్తాము? మన ఫాలోవర్స్ ఎందుకు రియాలిటీలోకి రావడం లేదు అన్నది పవన్ ఆవేదన. మరోవైపు.. ఈ స్థితికి కూడా కారణం పవన్ చేతగాని తనమే అని కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు.
కొంతకాలంగా టీడీపీ భజన చేస్తూ.., పార్టీ నిర్మాణం పట్టించుకోకపోవడమే ఇప్పుడు అభ్యర్థుల కరువుకు కారణం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బీజేపీ 8 స్థానాలు కేటాయించినా.. అభ్యర్థులు మాత్రం కమలం పార్టీ వారే అయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేనకి అన్నీ చోట్లా డిపాజిట్స్ గల్లంతు అయ్యాయి. ఇప్పుడు ఏపీలో కూడా జనసేన పరిస్థితి ఇలానే ఉంది. దీంతో.. ఇన్నాళ్లు పవన్ ని నమ్మిన ఫ్యాన్స్ మండిపడుతుంటే.. ఫ్యాన్స్ తనని అర్థం చేసుకోవడం లేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది? పవన్ దా? ఆయన్ని అతిగా నమ్మిన అభిమానులదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.