Kushboo Sundar: జాతీయ మహిళా కమిషన్ కు ఖుష్బు రాజీనామా! కారణం ఏంటంటే?

Kushboo Sundar Resigned National Commission for Women: ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ(BJP) ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. రాజీనామాకు గల కారణాలను వెల్లడించింది.

Kushboo Sundar Resigned National Commission for Women: ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ(BJP) ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. రాజీనామాకు గల కారణాలను వెల్లడించింది.

ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ(BJP) ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. ఖుష్బు సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె రాజీనామా చేయడానికి వెనక ఓ కారణం ఉన్నట్లు పేర్కొంది.

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది ఖుష్బు సుందర్. ఆమె రాజీనామాను కమిషన్ సైతం ఆమోదించింది. బీజేపీలో కీలక నేతగా ఉన్నా ఆమె.. క్రియాశీలక రాజకియాల్లోకి వచ్చేందుకే రాజీనామా చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఈ విధంగా రాసుకొచ్చింది..”రాజకీయాల్లో 14 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనసు మార్పును సూచిస్తోంది. బీజేపీకి పూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే జాతీయ మహిళా కమిషన్ కు రాజీనామా చేశాను. ఇక ఇన్ని రోజులు ఈ కమిషన్ లో పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లకు ధన్యవాదాలు” అని పేర్కొంది. కాగా.. తమిళనాడు రాజకీయాల్లో ఆమె కీలక నేతగా ఎదగాలని భావిస్తున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని మద్ధతుదారులు స్వాగతించారు.

Show comments