Pawan Kalyan: పొత్తులో పవన్ చిత్తు.. ఇది బాబు గేమ్!

టీడీపీతో పొత్తులో పవన్‌ కళ్యాణ్‌ చిత్తయ్యాడు.. సెకండ్‌ లిస్ట్‌లో అసలు సీట్లే లేవు.. ఫస్ట్‌ లిస్ట్‌లో ప్రటించిన 24 స్థానాల్లో కూడా బాబు నిర్ణయం మేరకే అభ్యర్థుల ప్రకటన అంట. ఆ వివరాలు..

టీడీపీతో పొత్తులో పవన్‌ కళ్యాణ్‌ చిత్తయ్యాడు.. సెకండ్‌ లిస్ట్‌లో అసలు సీట్లే లేవు.. ఫస్ట్‌ లిస్ట్‌లో ప్రటించిన 24 స్థానాల్లో కూడా బాబు నిర్ణయం మేరకే అభ్యర్థుల ప్రకటన అంట. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. రానున్న ఎలక్షన్‌లో 175కి 175 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగా నిర్ణయించుకుంది. అటు చూస్తేనేమో జగన్‌ని ఓడించడం కోసం టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాయి. ఇక జగన్‌ వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తుంటే.. కూటమి మాత్రం..ఇంకా మొదటి జాబితా దగ్గరే ఆగిపోయింది. 118 సీట్లో జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించాడు చంద్రబాబు. రెండో జాబితా ఉంది.. అందులో మరి కొన్ని సీట్లు ఉంటాయి అనుకుంటే.. అదేం లేదు అంటున్నారు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అని చంద్రబాబు, టీడీపీ నేతలు భావిస్తున్నారట.

ఇక జనసేన కేడర్‌ మాత్రం 24 సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తిగా ఉంది. పైగా అందులో కచ్చితంగా సీటు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కొందరు అభ్యర్థులకు పవన్‌ కళ్యాణ్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారిని పవన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన స్వార్థం చూసుకున్నాడు అని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక ఆ పార్టీకి కేటాయించిన 24 సీట్లకు కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాడు పవన్‌. మరో 19 స్థానాలకు క్యాండేట్స్‌ని ఖరారు చేయాలి. కానీ పనవ్‌ మాత్రం ఆదిశగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో అసలు ఆయన పోటీ చేసే స్థానంపైనే ఇంకా ఓ క్లారిటీ రాలేదని.. ఇక అభ్యర్థులను ఏం ప్రకటిస్తాడని విమర్శలు వస్తున్నాయి.

అంతేకాక 19 మంది జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం సాగుతోంది. ఈ 19 మందిని కూడా చంద్రబాబే సెలక్ట్‌ చేస్తాడని.. ఆయన చెప్పిన వారికే పవన్‌ కళ్యాణ్‌ టికెట్‌ ఇస్తాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పేరుకు మాత్రమే జనసేన అభ్యర్థులని.. కానీ వారు పని చేసేది చంద్రబాబు కనుసన్నల్లో.. టీడీపీ కోసం అంటున్నారు. ఆ 19 మంది గురించి బాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టే.. ప్రకటన ఇంకా ఆలస్యం అవుతుందని.. బాబు ఆదేశాలు రాలేదు కాబట్టే పవన్‌ మౌనంగా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక పవన్‌ మౌనంపై జనసేన కేడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది.. ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.. మరి ప్రచారం ఎప్పుడు మొదలుపెట్టాలి. ఇక అభ్యర్థుల ప్రకటన వెలువడగానే అందరూ అంగీకరించరు కదా.. అసంతృప్తులను బుజ్జగించి.. వారి మద్దతు కూడా కలపుకోవాలి. అటు చూస్తే సమయం దగ్గర పడుతుంది.. ఇటు పవనేమో ఏమాత్రం స్పందించకుండా.. సైలెంట్‌గా ఉన్నారు.. ఈ మౌనానికి అర్థం ఏంటి.. కనీసం ఈ 24 మందిని అయినా గెలిపించుకుందామంటే.. పవనే ఆ అవకాశం ఇవ్వడం లేదు అని జనసేన కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show comments