CM Jagan: పిఠాపురంలో పవన్ ఓటమి కోసం జగన్ త్రిముఖ వ్యూహం! సూపర్ ప్లాన్!

పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని ఓడించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ త్రిముఖ వ్యూహాన్ని రెడీ చేస్తోన్నారు. ఆ వివరాలు..

పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని ఓడించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ త్రిముఖ వ్యూహాన్ని రెడీ చేస్తోన్నారు. ఆ వివరాలు..

పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. ఇక్కడ టికెట్‌ ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు పవన్‌ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ వర్మను మోసం చేసిందంటూ ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. వర్మకు టికెట్ ఇవ్వాలని.. లేదంటే టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వర్మ అనుచరలు అల్టిమేటం జారీ చేశారు. అంతేకాక పిఠాపురంలో ఒక్క టీడీపీ ఓటు కూడా పవన్‌కు పడదని.. ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తనను ఓడించేందుకు జగన్‌ త్రిముఖ వ్యూహంతో బరిలోకి దిగుతున్నారు. ఆ వివరాలు..

గతంలో అనగా 2019 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడించిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో కూడా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడిని ఓడించాలని కంకణం కట్టుకుంది. అందుకు తగ్గుటుగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పిఠాపురం నుంచి వైసీపీ ఎంపీ గీతను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్‌ ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో.. వైసీపీ పిఠాపురాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కొత్త ఆపరేషన్‌ని ప్రారంభించింది. ఈక్రమంలో పవన్‌ను ఓడించేందుకు ఎంపీ మిథున్‌ రెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ. ఇప్పటికే గోదావరి జిల్లాల ఇంచార్జ్‌గా మిథున్‌రెడ్డిని నియమించిన జగన్‌.. ఇప్పుడు పిఠాపురం బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు.

మరోవైపు చూస్తే.. నేడు అనగా శుక్రవారం నాడు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌ సమక్షంలో పార్టీలో చేరి.. వైసీపీ కండువా కప్పకున్నారు. ఇక పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న కాపు ఓట్లు. పిఠాపురం నియోజకవర్గంలో సుమారుగా 30 శాతం వరకు కాపు ఓట్లు ఉన్నాయి. అందుకే పవన్‌ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరడంతో.. పవన్‌ ఆశలకు గండి కొట్టినట్లు అయ్యింది అంటున్నారు రాజకీయ పండితులు. నియోజకవర్గంపై ముద్రగడ ప్రభావం చాలా వరకు ఉందనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

అలానే ఇక్కడ ఎంపీగా ఉన్న వంగా గీతకు కాపుల్లో బాగానే మద్దతు ఉంది.. ఓటు బ్యాంక్‌ను సంపాదించుకుంది. అలానే ముద్రగడను ఇక్కడ ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై జగన్‌ వ్యూహాలు రెడీ చేస్తున్నారు. మొత్తానికి ఈఎన్నికల్లో కూడా పవన్‌ను ఓడించేందుకు జగన్‌ పిఠాపురంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అంతేకాక తనతో పాటు ముఖ్య నేతలతో పిఠాపురంలో ప్రచారం చేయించాలని జగన్‌ భావిస్తున్నారట. ఇలా పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు జగన్‌ కట్టుదిట్టమైన వ్యూహాలు రెడీ చేస్తున్నారు. గతంలో మాదిరే ఈ సారి ఎన్నికల్లో కూడా పవన్‌ను ఓడిస్తే.. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు.

Show comments