జనసేన నేత నాగబాబుపై ఎన్నికల సంఘం సీరియస్!

జనసేన పార్టీ నేత నాగబాబుపై ఏపీ ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనే విధంగా ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. అసలు నాగబాబు ఏం చేశారు? ఎన్నికల సంఘం ఎందుకు సీరియస్ అయ్యింది?

జనసేన పార్టీ నేత నాగబాబుపై ఏపీ ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనే విధంగా ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. అసలు నాగబాబు ఏం చేశారు? ఎన్నికల సంఘం ఎందుకు సీరియస్ అయ్యింది?

జనసేన పార్టీ నేత నాగబాబు షేర్ చేసిన ఓ వీడియోపై ఏపీ ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆ వీడియోలో నాగబాబు వైసీపీ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మే 12న అర్ధరాత్రి నుంచి వైసీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు పంచుతున్నారని.. ఓటర్ల వేళ్ళపై ముందే సిరా గుర్తు వేసేందుకు కుట్ర చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. తన దగ్గర సమాచారం ఉందని సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేశారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు వారి ఓటు హక్కుని వినియోగించుకోకుండా సిరా గుర్తు ముందుగానే వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏపీ ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించి ఎక్స్ ఖాతాలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక ట్వీట్ షేర్ చేసింది.

ఇవాళ ఉదయం జనసేన పార్టీ నేత నుంచి వచ్చిన వీడియో సందేశం వాట్సాప్ లో బాగా వైరల్ అవుతుందని.. అయితే అది పూర్తిగా తప్పుడు సమాచారమని ఎన్నికల సంఘం పేర్కొంది. వేరే రాజకీయ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచి పెడుతుందని.. అలానే ఓటు వేయకుండా ముందుగానే చెరగని సిరా చుక్క వేలి మీద గుర్తులు వేస్తుందని నాగబాబు ఆరోపించిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది. వేరే పార్టీపై చేస్తున్న ఆరోపణలు కరెక్టా? కాదా? అని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పరిశీలించారని.. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారని ఏపీ ఎన్నికల సంఘం పేర్కొంది. సిరా చుక్కను కేవలం కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల అధికారులు మాత్రమే వినియోగించేందుకు అధికారం ఉందని.. వేరే వాళ్లకు అనుమతి లేదని.. ఒకవేళ అలా ఎవరైనా సిరా చుక్కతో దొరికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.

కాబట్టి వాట్సాప్ మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి అని ఏపీ ఎన్నికల సంఘం సూచించింది. ఏ సమాచారం అయినా గానీ అది నిజమో కాదో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ వార్తల ట్రాప్ లో పడద్దని.. ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది. అలానే ఇలాంటి వార్తలు మీ దగ్గరకు వచ్చినప్పుడు తొందరపడి షేర్ చేసి చిక్కుల్లో పడవద్దని.. షేర్ చేసే ముందు వాస్తవమెంత అనేది తెలుసుకోవాలని సూచించింది. దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా సిరా గుర్తు వేస్తే.. వైసీపీ ఓట్లు కూడా పోతాయి కదా.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ సెటైర్లు విసురుతున్నారు. అంత డబ్బులిచ్చి తమ పార్టీకి ఓటు వేయమని చెప్పకుండా.. అస్సలు ఓటు వేయకండి అని ఎలా చెప్తారు? ఎక్కడో లాజిక్ మిస్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏపీ ఎన్నికల సంఘం నాగబాబుపై సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments