Pawan Kalyan: పవన్, నాగబాబు.. ఇది దొంగ ఓటు! సోషల్ మీడియాలో వైరల్!

ఏపీలో బోగస్‌ ఓట్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారగా.. స్వయంగా పవన్‌ కళ్యాణ్‌దే దొంగ ఓటంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆధారాలు పోస్ట్‌ చేసి మరీ చెబుతున్నారు. ఆ వివరాలు..

ఏపీలో బోగస్‌ ఓట్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారగా.. స్వయంగా పవన్‌ కళ్యాణ్‌దే దొంగ ఓటంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆధారాలు పోస్ట్‌ చేసి మరీ చెబుతున్నారు. ఆ వివరాలు..

మరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ ఎన్నికల కోసం రెడీ అవుతోంది. ఎలక్షన్స్‌కు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో.. వైసీపీ 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావొస్తుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో లిస్ట్‌ విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. మరోవైపు కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించిన టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపిణీయే ఇంకా కొలిక్కి రాలేదు. అది పూర్తయ్యి.. అభ్యర్థులను ప్రకటించే నాటికి పుణ్యకాలం కాస్త గడుస్తుందని అంటున్నారు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీలో బోగస్‌ ఓట్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

అంతేకాక బోగస్‌ ఓట్ల వ్యవహారంపై తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ స్వయంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇలా ఉండగా తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దొంగ ఓట్ల గురించి ఈసీకి ఫిర్యాదు చేసిన పవన్‌ కళ్యాణ్‌దే దొంగ ఓటు అనే చర్చ ఊపందుకుంది. పైగా పవన్‌ది దొంగ ఓటు అని ఆధారాలతో సహా నిరూపిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తుండటంతో.. ఇది వైరలవుతోంది.

పవన్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం అడ్రెస్‌తోనే ఓటు హక్కు కలిగి ఉన్నాడని.. ఇది నిబంధనలకు విరుద్దమని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌కి ఏజీజడ్‌ 3083045 గుర్తింపు కార్డు నంబరుతో.. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటు ఉంది. దీనిలో ఇంటి నంబరు 11-1903గా పేర్కొన్నారు. అయితే ఎవరైనా సరే నివాసముండే ఇంటి చిరునామాతో మాత్రమే ఓటుహక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పవన్ మాత్రం రాజకీయ పార్టీ ఆఫీస్ అడ్రస్‌తో ఓటుహక్కును పొందాడని చెబుతున్నారు. కనుక పవన్‌ది దొంగ ఓటే అంటున్నారు వైసీపీ నేతలు.

ఎన్నికలు నిబంధనలు ఏం చేబుతున్నాయి..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనగా 2019 ఎన్నికల వేళ.. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 91వ పోలింగ్‌ బూత్‌లో పవన్‌ తన ఓటు నమోదు చేసుకున్నారు. అయితే తాజాగా ఆరు నెలల కిత్రం పవన్‌.. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయ అడ్రసుకు తన ఓటును మార్చుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇలా అడ్రెస్‌ మార్చుకునే విషయంలో.. కేంద్ర ఎన్నికల సంఘ వెల్లడించిన నియమాల్లో ఆర్డినరీ రెసిడెన్స్‌ పేరుతో ప్రత్యేకంగా వివరించారు

దీనిపై గౌహతి హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు ప్రకారం ఇంట్రి అడ్రసు అంటే.. శాశ్వతంగా నివాసం ఉండేది అని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొంది. తాత్కలిక నివాసంగా అది ఉండకూడదని ఆ నిబంధనలోనే ఈసీ స్పష్టంగా వెల్లడించింది. దాని ప్రకారం చూసుకుంటే.. పవన్‌కు మంగళగిరిలో శాశ్వత నివాసం లేదు.. పార్టీ కార్యాలయ అడ్రస్‌తో ఓటు నమోదు చేసుకున్నాడు. కనుక ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని స్పష్టంగా అర్థం అవుతోంది అంటున్నారు వైసీపీ నేతలు, రాజకీయ పండితులు.

పవన్‌ బాటలోనే నాగబాబు..

అంతేకాక జనసేన నేత నాగబాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడంపైనా వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో నివాసం ఉండే నాగబాబు.. తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే.. అనగా 2023, డిసెంబర్‌ 4ననే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణంలోని వడ్డేశ్వరం, రాధారంగ నగర్‌లోని 5-263 ఇంటి అడ్రెస్‌తో ఆన్‌లైన్‌లో ఓటును దరఖాస్తు చేసుకున్నారు.

నాగబాబు, ఆయన భార్య, కూతురు నిహారిక, కుమారుడు వరుణ్‌తేజ్‌, కోడలు లావణ్య త్రిపాఠి కలిపి మొత్తం ఆరుగురు ఆ ఇంటి అడ్రసులో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ అన్‌లైన్‌లో అప్లై చేశారు. అయితే ప్రాథమిక స్థాయిలో బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌వో) పరిశీలనలో నా­గబాబు గానీ, వారి కుటుంబం గానీ ఆ అడ్రసులో నివాసం ఉండడం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు పేర్కొన్నారు. దాంతో నాగబాబు చేసిన ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. దాంతో నాగబాబు కూడా దొంగ ఓటు కోసం ప్రయత్నించాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పవన్‌, నాగబాబు తీరు చూస్తే.. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉంది అంటున్నారు జనాలు, వైసీపీ శ్రేణులు.

Show comments