పవన్ కళ్యాణ్ కు రాయుడు కౌంటర్! అలాంటి వాళ్లను పట్టించుకోవద్దంటూ..

  • Author Soma Sekhar Published - 04:26 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 04:26 PM, Tue - 11 July 23
పవన్ కళ్యాణ్ కు రాయుడు కౌంటర్! అలాంటి వాళ్లను పట్టించుకోవద్దంటూ..

అంబటి రాయుడు.. తన పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు ఈ స్టార్ బ్యాటర్. అన్నట్లుగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రారంతాల్లో పర్యటిస్తున్నాడు రాయుడు. అక్కడి పరిస్థితుల గురించి, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ప్రజలను అడిగి మరీ తెలుసుకుంటున్నాడు అంబటి రాయుడు. తాజాగా ఓ స్కూలో లో ఉన్న వసతులను పరిశీలించాడు రాయుడు. ఈ సందర్భంగా వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రాయుడు.

ఏపీలోని వాలంటీర్లను సంఘవిద్రోహ శక్తులతో పోల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారు అని పవన్ ఓ సభలో ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారన్ని లేపుతున్నాయి. దాంతో వాలంటీర్ల సంఘం వెంటనే పవన్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.

ఓ స్కూల్ ను పరిశీలించడానికి వచ్చిన రాయుడు మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడా లేని వాలంటరీ సిస్టం ఏపీలో ఉంది. ఇక్కడ ఈ సిస్టం అద్భుతంగా పనిచేస్తోంది. నేను వెళ్లిన ప్రాంతాల్లో అక్కడి వారిని అడిగా. వారు తమకు ఎంతో మంచి జరుగుతోందని చెప్పారు. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనిది మన రాష్ట్రంలో జరుగుతోంది. అదీకాక కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ సర్వీస్ చేశారు. అలాంటి వారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి” అని రాయుడు చెప్పుకొచ్చాడు.

ఇక పవన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అని విలేకరి అడగ్గా.. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని, అలాంటి వారిని మనం పట్టించుకోవద్దు అంటూ రాయుడు చెప్పుకొచ్చాడు. ఇక వాలంటీర్లందరు ధైర్యంగా ముందుకు వెళ్లాలని అంబటి రాయుడు పిలుపునిచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంబటి రాయుడు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వకూడదు’!

Show comments