Swetha
ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ చూసేసిన ప్రేక్షకులు ఇంకా కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది, మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.
ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ చూసేసిన ప్రేక్షకులు ఇంకా కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది, మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.
Swetha
ఉన్న సినిమాలన్నీ చూసేసి.. పాత సినిమాల కోసం కూడా సెర్చ్ చేసేసి కొత్త సినిమాలు ఏం వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని కొత్త సినిమాలు కూడా ఓటీటీ లోకి రాడానికి రెడీ అయిపోతున్నాయి. కాబట్టి ఓటీటీ లవర్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పి తీరాలి. ఇప్పటికే ఓటీటీ లో చాలా మంచి కంటెంట్ సినిమాలు ఉన్నాయి. ఇక వీటికి కొత్త కంటెంట్ కూడా యాడ్ అయితే, రానున్న రోజుల్లో ఇంకా ఓటీటీ లకు బాగా ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి రానున్న సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రానుందో చూసేద్దాం.
ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు ఆదరణ బాగా పెరిగిపోతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు అటు థియేటర్ లోను ఇటు ఓటీటీ లోను మలయాళీ సినిమాలదే హావ. ఇప్పుడు మరొక సినిమా థియేటర్ లో ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఓటీటీ ప్రేక్షకులను వెయిట్ చేయిస్తుంది. ఆ సినిమా మరేదో కాదు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్, ప్రేమమ్ ఫ్రేమ్ నివిన్ పాలీ హీరోలుగా నటించిన “వర్షం గల్కు శేషం”. మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో .. జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో మలయాళ సినిమాలకు పెరుగుతున్న ఆదరణను బట్టి.. ఓటీటీ లో ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక వర్షం గల్కు శేషం సినిమా కథ విషయానికి వస్తే మొత్తం అంతా 80’s , 90’s బ్యాక్డ్రాప్ లో కొనసాగుతూ ఉంటుంది. సూపర్ హిట్ డైరెక్టర్ వేణు.. తన స్నే హితుడు మురళి కోసం ప్రయాణం మొదలుపెడతాడు. తాను వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ కు తన కథను మొత్తం పంచుకుంటాడు. కేరళకు చెందిన వేణుకు చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. ఊరిలో జరిగే నాటక ఉత్సవాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ఓ రోజు అదే నాటకాల ద్వారా మురళితో పరిచయం ఏర్పడుతుంది. అతని టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బావుంటుందని వేణు సలహా ఇస్తాడు. కానీ మురళి లైట్ తీసుకుంటాడు. యితే మురళి చేసిన ప్రయత్నంతో వేణుకి దర్శకత్వం చేసే ఛాన్స్ వస్తుంది. ఏ క్రమంలో వేణు దర్శ కుడిగా ఎదుగుతూ వెళితే మురళి మాత్రం ఏమైపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది ? వీరిద్దరూ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.