Keerthi
లవ్ అండ్ ఎమోషనల్ స్టోరితో తెరకెక్కించిన రంగోలి చిత్రం సినిమాను తెలుగులో సత్య అనే టైటిల్ తో రీమేక్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేయడానికి రెడీ గా ఉందని సమాచారం వినిపిస్తోంది. ఇంతకి ఎక్కడంటే..
లవ్ అండ్ ఎమోషనల్ స్టోరితో తెరకెక్కించిన రంగోలి చిత్రం సినిమాను తెలుగులో సత్య అనే టైటిల్ తో రీమేక్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేయడానికి రెడీ గా ఉందని సమాచారం వినిపిస్తోంది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
కోలీవుడ్ లో ఇటీవలే విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘రంగోలి’. కాగా, ఈ సినిమాలో హీరోగా హమరేష్ నటించగా.. ఇందులో హీరోయిన్ గా ప్రార్ధన నటించింది. ఇక ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. అయితే తమిళ్ లో సూపర్ హట్ అయిన ఈ మూవీకి రీమేక్‌గా తెలుగులో ‘సత్య’ పేరుతో మే 10వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా, సినిమా థియేటర్లలో విడుదలై కాకముందే ఇప్పుడు ఓటీటీలో సందండి చేయడానికి రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇంతకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..
లవ్ అండ్ ఎమోషనల్ స్టోరితో తెరకెక్కించిన ‘రంగోలి’ చిత్రం సినిమాను తెలుగులో ‘సత్య’ అనే టైటిల్ తో రీమేక్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో హమరేష్, ప్రార్ధన హీరో, హీరోయిన్ లు నటించారు. ఇక ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సత్య మూవీ.. తెలుగులో ప్రమోషన్స్ బాగానే జరిగిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కాగా, అదే రోజున థియేటర్లలో విడుదలైన ప్రతినిధి 2, కృష్ణమ్మ సినిమాలపై అందరు ఆసక్తి కనబరిచారు. దీంతో సత్య సినిమా అసలు థియేటర్లలో విడుదలైన విషయమే చాలామందికి తెలియకుండా పోయింది.
ఈ క్రమంలోనే సత్య సినిమా పెద్దగా టాక్ తెచ్చుకోలేకపోవడంతో.. రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలో సందడి చేయడానికి రెడీగా ఉందని సమాచారం వినిపిస్తోంది. ఇకపోతే సత్య సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ హక్కులకు కొనుగోలు చేసుకున్నట‍్లు సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమా ఈనెల అఖారులో కానీ, జూన్ మొదటి వారంలో కానీ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు.
ఇక సత్య సినిమా విషయానికొస్తే.. సత్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే సినిమాలో రోటీన్ లవ్ స్టోరీతో పాటు తల్లిదండ్రుల ఎమోషన్ ఎక్కువగా చూపించారని రివ్యూలు వచ్చాయి. ఇకపోతే నిదానంగా సాగిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా చూసినవాళ్లకు మాత్రం మెప్పిస్తుందని టాక్ వచ్చింది. అయితే లవ్ స్టోరీని, సన్నివేశాలను ఇంకాస్తా కొత్తగా రాసుకుంటే బాగున్ను అని చాలామంది అభిప్రాయపడ్డారు. మరి, త్వరలో సత్య సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.