iDreamPost
android-app
ios-app

OTT Leagal Drama : OTTలో 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్న లీగల్ డ్రామా.. మిస్ అయ్యారా?

  • Published Jul 20, 2024 | 5:01 AMUpdated Jul 20, 2024 | 5:01 AM

ఇప్పుడు ఓటీటీ లో ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక రిలీజ్ తర్వాత.. ఏ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయని రిజల్ట్ కోసం ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఓ లీగల్ డ్రామా మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ వ్యూస్ అప్ డేట్ వచ్చేసింది.

ఇప్పుడు ఓటీటీ లో ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక రిలీజ్ తర్వాత.. ఏ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయని రిజల్ట్ కోసం ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఓ లీగల్ డ్రామా మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ వ్యూస్ అప్ డేట్ వచ్చేసింది.

  • Published Jul 20, 2024 | 5:01 AMUpdated Jul 20, 2024 | 5:01 AM
OTT Leagal Drama : OTTలో 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్న లీగల్ డ్రామా.. మిస్ అయ్యారా?

గత కొన్ని నెలలుగా.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎంటర్టైన్మెంట్ తో దుమ్ము దులిపేస్తున్నాయి. ఆ జోనర్ ఈ జోనర్ అని సంబంధం లేకుండా వచ్చిన ప్రతి మూవీ , ప్రతి సిరీస్ కూడా ఓటీటీ లో మంచి టాక్ తో దూసుకుపోతుంది. పైగా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించని సినిమాలు సైతం.. ఓటీటీ లో ఇట్టే మెప్పించేస్తున్నాయి. దీనితో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి వాటికి ఇంకాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇలా ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవ్వడమే కాకుండా.. ఏ ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఏ ఏ సినిమాలకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనే అప్ డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయినా ఓ లీగల్ డ్రామా మూవీ వ్యూస్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఈ సినిమా పేరు “సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై” . ఈ మూవీలో మనోజ్‌ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాలో పెద్దగా పాటలు , ఫైట్ లు , హీరోయిజం లాంటివి లేకపోయినా సరే.. ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఒక స్వామిజి చేసిన తప్పుడు పనికి శిక్ష విధించడం కోసం.. ఓ సాధారణ లాయర్ చేసే ప్రయత్నమే ఈ మూవీ. ఇక ఈ మూవీ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఏ మూవీకి దక్కని ఘనత ఈ మూవీకే దక్కింది. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకున్నట్లు జీ5 వెల్లడించింది. ఇక అంతే కాకుండా.. మరొక కొత్త మూవీ అప్ డేట్ ను కూడా ఇచ్చేసింది. “భయ్యాజీ వస్తున్నాడు. సిద్ధంగా ఉండండి. సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై సినిమాకు 100 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదైన సందర్భంగా ఈ మూవీ మేకర్స్ మరో బ్లాక్‌బస్టర్ భయ్యాజీతో వస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయీ 100వ సినిమా. భయ్యాజీ జులై 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది”. అంటూ.. మరో మూవీ గురించి అనౌన్స్ చేసింది.

ఇక సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై కథ విషయానికొస్తే.. ఇదొక లీగల్ డ్రామా.. ఆశారాం బాపు లైంగిక వేధింపుల కేసును ఆధారంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. అతనికి ఈ కేసులో సరైన శిక్ష పడడం కోసం ఓ లాయర్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ లాయర్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి ? చివరికి ఆ లాయర్ కు శిక్ష పడిందా లేదా అనేది తెరపైన చూడాల్సిన కథ. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ ఇప్పుడు మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా లైట్ తీసుకుంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి